శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : శనివారం, 12 ఆగస్టు 2017 (17:06 IST)

ఒకే డ్రస్సును మళ్లీ మళ్లీ వేసుకుంటే బాగుంటుందా?: అమలా పాల్

ఒకే డ్రస్సును మళ్ళీ మళ్లీ వేయడం కుదరదు. క్యారెక్టర్‌కు తగినట్లు మార్చుకోవాల్సిందేనని సినీ నటి అమలా పాల్ అంటోంది. ధనుష్, అమలా పాల్, కాజల్ నటించిన వీఐపీ 2 శుక్రవారం రిలీజైన నేపథ్యంలో ఓ ప్రమోషన్ కార్యక్ర

ఒకే డ్రస్సును మళ్ళీ మళ్లీ వేయడం కుదరదు. క్యారెక్టర్‌కు తగినట్లు మార్చుకోవాల్సిందేనని సినీ నటి అమలా పాల్ అంటోంది. ధనుష్, అమలా పాల్, కాజల్ నటించిన వీఐపీ 2 శుక్రవారం రిలీజైన నేపథ్యంలో ఓ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న అమలాపాల్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది. ధనుష్ నటన బాగుందని.. దర్శకత్వం, నిర్మాణం వంటి అనేక విభాగాల్లో రాణించే సత్తా ఆయనకుందని వెల్లడించింది. 
 
కష్టపడి పైకొచ్చిన వ్యక్తుల్లో ధనుష్ ఒకడని తెలిపింది. తాను మాత్రమే నటనపరంగా మంచి మార్కులు కొట్టేయకుండా.. తనతో పాటు నటించే నటీనటుల నుంచి నటనను రాబట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తాడని అమలా పాల్ ప్రశంసలు కురిపించింది. ఒక్కో సినిమాలో కొత్త కొత్త విషయాలు నేర్పిస్తాడని ధనుష్ గురించి అమలా పాల్ తెలిపింది. 
 
తిరుట్టుపయలె సినిమా ఫస్ట్ లుక్‌లో గ్లామర్‌గా కనిపించడంపై ఆమె మాట్లాడుతూ.. సినిమా సినిమాకు వెరైటీ వుండాలని.. ఒకే తరహా పాత్రల్లో కనిపించకూడదని వెల్లడించింది. అత్యుత్తమ నటిగా రాణించాలంటే విభిన్న పాత్రలు చేయాల్సిందేనని చెప్పుకొచ్చింది. ఒకే డ్రస్సును మళ్లీ మళ్లీ వేస్తే బాగుండదు కదా అంటూ అమలా పాల్ సమాధానమిచ్చింది.