మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2017 (13:11 IST)

సాయిపల్లవిని నాలుగేళ్ల పాపకు తల్లిని చేసిన అమలా పాల్ మాజీ భర్త?!

ప్రేమమ్, ఫిదా వంటి సినిమాల్లో నటనకు గుర్తింపు గల పాత్రల్లో కనిపించిన సాయిపల్లవి.. మరో వైవిధ్య పాత్రలో కనిపించనుంది. గ్లామర్‌కు దూరంగా వుంటానని.. నటనకు ప్రాధాన్యత గల పాత్రల్లో మాత్రమే కనిపిస్తానని చెప్

ప్రేమమ్, ఫిదా వంటి సినిమాల్లో నటనకు గుర్తింపు గల పాత్రల్లో కనిపించిన సాయిపల్లవి.. మరో వైవిధ్య పాత్రలో కనిపించనుంది. గ్లామర్‌కు దూరంగా వుంటానని.. నటనకు ప్రాధాన్యత గల పాత్రల్లో మాత్రమే కనిపిస్తానని చెప్తూ వచ్చిన సాయిపల్లవి ఫిదాకు తర్వాత మంచి ఆఫర్లను కైవసం చేసుకుంది. తాజాగా సినీ నటి అమలాపాల్ మాజీ భర్త రూపొందించే చిత్రంలో సాయి పల్లవి కనిపించనుంది. 
 
వైవిధ్య చిత్రాల దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ చెప్పిన స్త్రీ ప్రాధాన్య  స్క్రిప్ట్‌కు ఫిదా అయిపోయింది. సమాజంలో స్త్రీలు ఎదుర్కొనే అబార్షన్ల నేపథ్యంలో సాగే స్క్రిప్టులో నటించేందుకు సాయిపల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రం ''కరు'' అనే పేరుతో తెరకెక్కుతోంది. 
 
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వున్న ఈ సినిమాలో నాలుగేళ్ల పాపకు తల్లిగా సాయిపల్లవి నటిస్తోంది. ‘ఫిదా’లో సొంతంగా డబ్బింగ్‌ చెప్పి తెలుగు ప్రేక్షకులను అలరించిన సాయిపల్లవి.. తమిళంలోను తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకునేందుకు సిద్ధం అవుతోంది.