బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 3 నవంబరు 2017 (11:29 IST)

అలాంటి పాడు పనులు చేయను... లగ్జరీ కారువివాదంపై నటి అమలాపాల్‌

పన్నులు ఎగ్గొట్టేటువంటి పాడుపనులు తాను చేయబోనని సినీ నటి అమలా పాల్ స్పష్టం చేశారు. విదేశాల్లో కొనుగోలు చేసిన బెంజ్ లగ్జరీ కారును పుదుచ్చేరికి చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి పేరుతో అమలా పాల్ రిజిస్టర్

పన్నులు ఎగ్గొట్టేటువంటి పాడుపనులు తాను చేయబోనని సినీ నటి అమలా పాల్ స్పష్టం చేశారు. విదేశాల్లో కొనుగోలు చేసిన బెంజ్ లగ్జరీ కారును పుదుచ్చేరికి చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి పేరుతో అమలా పాల్ రిజిస్టర్ చేయించి వాడుకుంటున్నారు. దీనిపై రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీయగా, ఈ కారుకు చెల్లించాల్సిన రూ.20 లక్షల పన్ను ఎగ్గొట్టినట్టు తేలింది. ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీంతో అమలాపాల్ స్వయంగా స్పందించారు. 
 
"నేను భారతదేశ పౌరురాలిని. ఎక్కడికైనా వెళతాను. ఏమైనా కొంటాను" అని తెగేసి చెప్పారు. 'ఓ దినపత్రిక సర్క్యులేషన్‌ పెంచుకోవడానికి ఇలాంటి చౌకబారు విధానాలను అనుసరించడం తీవ్ర దిగ్ర్భాంతి కలిగించింది. ‘మాతృభూమి’ అని పేరు పెట్టుకున్న ఆ పత్రిక, జాతి సమైక్యతను దెబ్బతీసే విధంగా కథనాలు ప్రచురించడం దురదృష్టకరం. చట్టాన్ని గౌరవించే భారతీయ పౌరురాలిని నేను. ఈ ఏడాది రూ.కోటికి పైగా పన్ను చెల్లించాను. ఆ పత్రిక కథనంలో పేర్కొన్న అవకతవకలేవీ జరగలేదని అధికారులు గుర్తించారని చెప్పారు. 
 
అయినా నాపై, నా కుటుంబంపై కొందరు కావాలని బురద చల్లుతున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒకే కరెన్సీ చలామణీలో ఉంది. జీఎస్టీ కూడా అమల్లోకి వచ్చింది. ఆ విషయం మరిచిన ఈ జ్ఞానులకు గుణపాఠం చెప్పాలి. తెలుగు సినిమాల్లో నటించడానికి లేక బెంగళూరులో ఆస్తులు కొంటానికి వీళ్ల (పత్రికను ఉద్దేశించి) అనుమతి తీసుకోవాలా" అని ఆమె ప్రశ్నించారు.