బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: మంగళవారం, 31 అక్టోబరు 2017 (14:50 IST)

తను నటించిన సినిమా బాగా లేదంటే చంపేస్తానంటున్న హీరోయిన్

కొంతమంది హీరోయిన్లు అందంగా ఉంటారు గాని నిజ జీవితంలో వారు వ్యవహరించే తీరు చాలామందికి నచ్చదు. వరుస హిట్లతో దూసుకుపోతున్న రాశీ ఖన్నా నిజ జీవితంలో ఓటమిని, విమర్శను అస్సలు సహించదట. తాను నటించిన సినిమాలు బాగా లేదు.. ఫ్లాప్ అని ఎవరైనా అంటే ఏ మాత్రం ఆలోచించక

కొంతమంది హీరోయిన్లు అందంగా ఉంటారు గాని నిజ జీవితంలో వారు వ్యవహరించే తీరు చాలామందికి నచ్చదు. వరుస హిట్లతో దూసుకుపోతున్న రాశీ ఖన్నా నిజ జీవితంలో ఓటమిని, విమర్శను అస్సలు సహించదట. తాను నటించిన సినిమాలు బాగా లేదు.. ఫ్లాప్ అని ఎవరైనా అంటే ఏ మాత్రం ఆలోచించకుండా మిమ్మల్ని చంపేస్తానంటూ.. గట్టిగా అరిచి వెళ్ళిపోతుందట రాశీ ఖన్నా. 
 
తన చిన్నతనం నుంచి రాశీ ఖన్నాకు కోపమెక్కువ అంటున్నారు కుటుంబ సభ్యులు. పాఠశాల నుంచి కళాశాల చదివే రోజుల్లో ఎప్పుడైనాసరే ముక్కుసూటితనంతో రాశీఖన్నా ఉండేదని, అయితే ఓటమిని అస్సలు జీర్ణించుకోదని, దీంతో స్నేహితులు ఆమె చేతిలో కావాలనే ఓడిపోయేవారని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. 
 
పెరిగి పెద్దయిన తర్వాతైనా రాశీ ఖన్నాలో మార్పు వస్తుందనుకున్నారు. కానీ అది మాత్రం కనిపించడం లేదట. తాను నటించిన సినిమా బాగున్నా, బాగా లేకపోయినా, ఫెయిలైనా సరే ఆమె ముందు అస్సలు చెప్పకూడదట. ఐతే రాశీ ఖన్నాకు కోపం కొద్దిసేపు మాత్రమే ఉంటుందట. ఆ తరువాత మళ్ళీ వచ్చి మాట్లాడి సారీ చెప్పేసి వెళ్ళిపోతుందట.