గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 17 అక్టోబరు 2017 (14:11 IST)

'ఆక్సిజన్‌' ఆడియోకు ముహుర్తం కుదిరింది...

హీరో గోపీచంద్, రాశిఖన్నా, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న చిత్రం "ఆక్సిజన్". ఈ చిత్రానికి ఏఎం.జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నారు. ప్రస్తుత

హీరో గోపీచంద్, రాశిఖన్నా, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న చిత్రం "ఆక్సిజన్". ఈ చిత్రానికి ఏఎం.జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఆడియోను త్వరలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
 
ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా భారీ టెక్నాలజీతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను ఈ నెల 23వ తేదీన హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. తమిళ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతబాణీలు సమకూర్చారు. ముంబై, గోవా, సిక్కిం, చెన్నై త‌దిత‌ర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు మరో విభిన్న పాత్రలో కనిపించనున్నారు.