శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By pnr
Last Updated : శనివారం, 30 సెప్టెంబరు 2017 (14:32 IST)

'లైఫ్‌ అంటే నాదే అనుకున్నా'నంటున్న గోపీచంద్ : ఆక్సిజన్ ట్రైలర్

శ్రీసాయిరాం క్రియేషన్స్ పతాకంపై గోపీచంద్, రాశీఖన్నా, అను ఇమ్మాన్యుయేల్‌‌లు జంటగా నటించిన చిత్రం 'ఆక్సిజన్'. ఈ చిత్రం ట్రైలర్ విజయదశమి కానుకగా దర్శకుడు ఎ.ఎమ్‌.జ్యోతికృష్ణ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశ

శ్రీసాయిరాం క్రియేషన్స్ పతాకంపై గోపీచంద్, రాశీఖన్నా, అను ఇమ్మాన్యుయేల్‌‌లు జంటగా నటించిన చిత్రం 'ఆక్సిజన్'. ఈ చిత్రం ట్రైలర్ విజయదశమి కానుకగా దర్శకుడు ఎ.ఎమ్‌.జ్యోతికృష్ణ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఎస్‌. ఐశ్వర్య నిర్మించిన ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతం సమకూర్చగా, త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.
 
'సంతోషాన్ని పంచే అమ్మానాన్న... నవ్వుతూ పలకరించే ప్రియురాలు.. పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చే స్నేహితులు.. లైఫ్‌ అంటే నాదే అనుకున్నాను. ఒక్కరోజు అంతా చీకటైపోయింది. నాకు జరిగింది.. మీకూ జరగచ్చు. కానీ అలా జరగనివ్వను' అంటూ ఈ ట్రైలర్‌లో గోపీచంద్ డైలాగ్‌లు చెప్పడం వినిపిస్తుంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, కలర్‌ఫుల్ విజువల్స్‌తో ఆకట్టుకునేలా దీనిని రూపొందించారు. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.