గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: బుధవారం, 25 అక్టోబరు 2017 (20:35 IST)

ఆసుపత్రిలో చనిపోయిన చిన్నారి... ఆందోళన చేసిన పేరెంట్స్‌కి తుపాకీ గురిపెట్టిన వైద్యుడు...

తిరుపతిలో ఒక వైద్యుడు రోగులపై తుపాకీ ఎక్కుపెట్టాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి మరణించిందని బంధువులు దాడికి దిగితే ఆగ్రహంతో ఊగిపోయిన వైద్యుడు ఆందోళన చేసిన వారిని చంపేస్తానంటూ తుపాకీతో బెదిరించాడు. చివరకు పోలీసుల జోక్యంతో సమస్య సద్దుమణిగింద

తిరుపతిలో ఒక వైద్యుడు రోగులపై తుపాకీ ఎక్కుపెట్టాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి మరణించిందని బంధువులు దాడికి దిగితే ఆగ్రహంతో ఊగిపోయిన వైద్యుడు ఆందోళన చేసిన వారిని చంపేస్తానంటూ తుపాకీతో బెదిరించాడు. చివరకు పోలీసుల జోక్యంతో సమస్య సద్దుమణిగింది.
 
చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన గుణశేఖర్, సునీత దంపతుల 25 రోజుల నవజాత శిశువుకు హై ఫీవర్ వచ్చింది. మూడురోజులుగా పీలేరులోని వైద్యుల వద్ద చిన్నారికి చికిత్స చేయించినా తగ్గలేదు. దీంతో తిరుపతి దేవేంద్ర థియేటర్ సమీపంలోని చిన్నపిల్లల ఆసుపత్రికి చిన్నారిని తీసుకొచ్చారు తల్లిదండ్రులు. అప్పటికే చిన్నారికి మూడుసార్లు ఫిట్స్ వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. వైద్యుడు వెంకటేశ్వర్లు శాయశక్తులా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. 
 
చిన్నారి మృతి చెందడంతో బంధువులు ఆగ్రహంతో ఊగిపోయి ఆసుపత్రిపై దాడికి దిగారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో వైద్యుడికి చిర్రెత్తుకొచ్చింది. తన వద్దనున్న లైసెన్సు గన్‌ను తీసుకొచ్చి చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న బంధువులను అక్కడి నుంచి పంపేశారు. దీంతో సమస్య సద్దుమణిగింది.