సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 31 అక్టోబరు 2017 (13:44 IST)

బోయపాటితో మహేష్ బాబు సినిమా.. పక్కా మాస్‌గా ప్రిన్స్..

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌ బాబు మంచి హిట్ కోసం కథల ఎంపికలో జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే ఫ్లాప్ టాక్స్ సంపాదించుకున్న తన సినిమాలు కలెక్షన్లు తెచ్చిపెడుతున్నా.. ఇక తప్పకుండా హిట్ కొట్టాల్సిందేనని ప్రిన్

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌ బాబు మంచి హిట్ కోసం కథల ఎంపికలో జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే ఫ్లాప్ టాక్స్ సంపాదించుకున్న తన సినిమాలు కలెక్షన్లు తెచ్చిపెడుతున్నా.. ఇక తప్పకుండా హిట్ కొట్టాల్సిందేనని ప్రిన్స్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి సినిమాను కొత్త పంథాలో ఎంచుకుంటున్నారు. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "భరత్‌ అనే నేను" రాజకీయం నేపథ్యంలో సాగబోతోంది.
 
ఈ చిత్రంలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సీఎంగా కనిపిస్తారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఆ సినిమా సెట్స్‌పై ఉంది. ఆ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కనుంది. అది అమెరికా నేపథ్యంలో సాగే ఓ కొత్త రకమైన కథతో రూపుదిద్దుకోనుందని టాక్ వస్తోంది. 
 
ఈ చిత్రాలు పూర్తయ్యాక మహేష్ బోయపాటి శీను పక్కా మాస్ కథతో సిద్ధం అవుతున్నట్లు  తెలిసింది. ఈ చిత్రం కోసం మహేష్‌తో  చేతులు కలిపేందుకు ఓ  ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమా షూటింగ్‌లన్నీ పూర్తయ్యాకే మహేష్ బాబు జక్కన్న రాజమౌళితో సినిమా చేస్తారని తెలుస్తోంది.