మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (12:26 IST)

అమలాపాల్ భేష్.. ధైర్యాన్ని కొనియాడిన నడిగర్ సంఘం

సినీనటి అమలాపాల్‌ను నడిగర్ సంఘం అభినందించింది. లగ్జరీ కారు కేసులో పన్ను ఎగవేతతో కష్టాలు ఎదుర్కొన్న అమలాపాల్, లైంగిక వేధింపులకు గురైంది. లైంగిక వేధింపులకు గురైన వెంటనే ఆ విషయాన్ని దాచకుండా పోలీసులకు ఫి

సినీనటి అమలాపాల్‌ను నడిగర్ సంఘం అభినందించింది. లగ్జరీ కారు కేసులో పన్ను ఎగవేతతో కష్టాలు ఎదుర్కొన్న అమలాపాల్, లైంగిక వేధింపులకు గురైంది. లైంగిక వేధింపులకు గురైన వెంటనే ఆ విషయాన్ని దాచకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై అమలాపాల్‌ను నడిగర్ సంఘం అభినందించింది. ఈ విషయంలో అమలాపాల్ ధైర్యాన్ని నడిగర్ సంఘం కొనియాడింది.
 
ఈ మేరకు ఓ ప్రకటనను కూడా నడిగర్ సంఘం విడుదల చేసింది. లైంగిక వేదింపుల గురించి కొంతమంది నటీమణులు బయటకు మాట్లాడేందుకు వెనుకాడుతున్న తరుణంలో తనకు జరిగిన అన్యాయంపై ధైర్యంగా ముందుకు రావడం అభినందనీయమని తెలిపింది. ఈ కేసుపై పోలీసులు వెంటనే స్పందించి కేసును నమోదు చేసినందుకు నడిగర్ సంఘం కృతజ్ఞతలు తెలియజేసింది.