మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 11 జూన్ 2018 (14:35 IST)

అమ్మవారికి మేకను బలిచ్చే ఆలయం... మాంసం భుజించి ఆలయానికి వెళ్లొచ్చా?

పెద్దలు చెప్పే మాటలకు అర్థం.. పరమార్థం ఉంటుంది. అందుకే "పెద్దల మాట చద్దన్నం మూట" అని అంటారు. అయితే, ఇవన్నీ ఆ కాలానికే పరిమితమయ్యాయని చెప్పొచ్చు. నేటి యువత పెద్దల మాట కాదు కదా.. అసలు పెద్దలనే లెక్క చేయ

పెద్దలు చెప్పే మాటలకు అర్థం.. పరమార్థం ఉంటుంది. అందుకే "పెద్దల మాట చద్దన్నం మూట" అని అంటారు. అయితే, ఇవన్నీ ఆ కాలానికే పరిమితమయ్యాయని చెప్పొచ్చు. నేటి యువత పెద్దల మాట కాదు కదా.. అసలు పెద్దలనే లెక్క చేయడం లేదు. ఇక వారి మాటలను ఎక్కడ వింటారు. అయితే అందరూ ఈ కోవకే చెందినవారిగా పరిగణించలేం.
 
యువతలో చాలామంది మంచి మార్గంలో నడిస్తున్నారు. పెద్దల మాట వింటూ... వారు చూపిన మార్గంలో పయనిస్తున్నారు. అలాంటి పెద్దలు చెప్పిన మాటల్లో ఒకటి.. మాంసాహారాన్ని భుజించి ఆలయాలకు వెళ్లకూడదని. దీంతో చాలామంది ఇప్పటికీ మాంసం ఆరగించి ఆలయాలకు వెళ్లరు. దీని వెనుక బలమైన కారణం లేకపోలేదు. 
 
మాంసాహారాన్ని భుజించడం వల్ల బుద్ధి మందగిస్తుందని.. కామక్రోధాలపై వ్యామోహం పెరిగి.. ఆధ్యాత్మికపై మనసు లగ్నం చేయలేరట. అందుకే మాంసాన్ని ఆలయానికి వెళ్లే ముందు భుజించవద్దని పెద్దలు చెపుతున్నారు. అయితే కొన్ని ఆలయాల్లో మాత్రం ఈ పట్టింపు లేదు. కొన్ని అమ్మవారి ఆలయాలకు మాంసాహారం తిన్నా కూడా వెళ్లొచ్చు. 
 
ఉదాహరణకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన పూరీ జగన్నాథ ఆలయంలో స్వామివారి భార్య విమలా దేవికి ప్రతిరోజూ పూజలు చేసి మేకను బలిస్తారు. ఆ మాంసాన్నే భక్తులకు ప్రసాదంగా పెడతారు. కానీ శైవవైష్ణవ ఆలయాలకు, హనుమాన్ ఆలయాలకు మాత్రం మాంసాన్ని ఆరగించి వెళ్ళకూడదు.