జాతిపిత 150వ జయంత్యుత్సవాలు.. ఆ రోజు శాకాహారమే.. ''వెజిటేరియన్ డే''గా?
జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాల సందర్భంగా అక్టోబర్ 2న శాకాహారాన్ని మాత్రమే ప్రయాణీకులకు అందుబాటులోకి తేనున్నారు. ఆ రోజును భారతీయ రైల్వేలు ''వెజియేరియన్ డే''గా నిర్వహించాలని నిర్ణయించాయి. ఇందుల
జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాల సందర్భంగా అక్టోబర్ 2న శాకాహారాన్ని మాత్రమే ప్రయాణీకులకు అందుబాటులోకి తేనున్నారు. ఆ రోజును భారతీయ రైల్వేలు ''వెజియేరియన్ డే''గా నిర్వహించాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా అందుకే 2018-2020 సంవత్సరాల్లో అక్టోబర్ 2న ఎలాంటి మాంసాహారాన్ని రైల్వేల పరిధిలో అందుబాటులో ఉంచకూడదని.. అన్ని రైల్వే జోన్‌లకూ సర్క్యులర్‌లను రైల్వే బోర్డు పంపింది.
అంతేగాకుండా.. అక్టోబర్ 2న రైల్వే ఉద్యోగులందరూ శాకాహారులుగా మారిపోవాలని సూచించింది. అక్టోబర్ 2న దండీ మార్చ్‌ని గుర్తు చేస్తూ, సబర్మతీ నుంచి స్వచ్ఛతా ఎక్స్ ప్రెస్ బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు.
ఇక గాంధీ చిత్రాలతో కూడిన డిజిటల్ మ్యూజియం రైలును దేశవ్యాప్తంగా నడిపిస్తామని పేర్కొంది. రైలు బోగీలను గాంధీ చిత్రాలతో అలంకరిస్తామని రైల్వే శాఖ వెల్లడించింది. అలాగే రైల్వే టిక్కెట్లు కూడా మహాత్మా గాంధీ బొమ్మతో కూడిన వాటర్ మార్కులో వస్తాయని రైల్వే అధికారులు తెలిపారు.