మంగళవారం, 5 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 20 మే 2018 (14:03 IST)

రమణ దీక్షితులు తప్పులు చేశారు.. శ్రీవారి నగలన్నీ భద్రంగా వున్నాయ్: టీటీడీ ఈవో

ఏడుకొండలపై అర్చకుల రిటైర్ మెంట్ పై వాడివేడిగా చర్చ సాగుతున్న వేళ.. వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం స్వామివారికి జరగాల్సిన పూజా విధానంపై స్పష్టమైన ఆదేశాలున్నాయని రమణ దీక్షితులు తెలిపారు. కానీ ప్రస్తుతం తిరు

ఏడుకొండలపై అర్చకుల రిటైర్ మెంట్ పై వాడివేడిగా చర్చ సాగుతున్న వేళ.. వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం స్వామివారికి జరగాల్సిన పూజా విధానంపై స్పష్టమైన ఆదేశాలున్నాయని రమణ దీక్షితులు తెలిపారు. కానీ ప్రస్తుతం తిరుమలలో ఆ మంత్ర ప్రకారం, క్రియలు సాగడం లేదని ఆరోపించారు. స్వామికి జరిపే ఉపచారాలు, త్రికాల పూజల గురించి శాస్త్రంలో ఉందన్నారు. అవి సరిగ్గా జరగకుంటే వర్షాలు సరిగ్గా కురవవని దేశానికి అరిష్టమని తెలిపారు. 
 
అయితే తిరుమల తిరుపతి దేవస్థానంపై మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు చేసిన విమర్శలన్నీ అవాస్తవాలేనని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు, పూజలన్నీ శాస్త్రోక్తంగా జరుగుతున్నాయని తెలిపారు. గతంలో తప్పులు చేసిన రమణ దీక్షితులు, తాజాగా లేనిపోని ఆరోపణలు చేసి మరిన్ని తప్పులు చేస్తున్నారని, అందుకాయన వివరణ ఇచ్చుకోవాల్సిందేనని హెచ్చరించారు. 
 
అంతేగాకుండా శ్రీవారి నగలపై రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు నిరాధారమని, నగలన్నీ భద్రంగా ఉన్నాయని అనిల్ కుమార్ చెప్పారు. ఏటా స్వామివారి నగలను కొన్ని రోజుల పాటు భక్తులకు చూపించేందుకు తాము సిద్ధమేనన్నారు. మిరాశీ వంశీకులకు, బ్రాహ్మలకు ఎటువంటి అన్యాయమూ జరగబోదని హామీ ఇచ్చారు. స్వామి సేవల నిమిత్తం ఒక్కో కుటుంబంలో ఒకరికి చొప్పున నలుగురికి ప్రధాన అర్చక పదవులను ఇచ్చామని తెలిపారు.
 
2012లోనే అర్చకుల పదవీ విరమణ వయోపరిమితిని 65 ఏళ్లుగా నిర్ణయించినట్టు గుర్తు చేశారు. అప్పట్లో ముగ్గురు అర్చకులు రిటైర్ అయ్యారని చెప్పారు. ప్రస్తుతమున్న అర్చకుల సర్వీస్ ప్రకారం సీనియర్‌‌ను ప్రధాన అర్చకులుగా నియమించామని అన్నారు.