శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: మంగళవారం, 27 మార్చి 2018 (19:22 IST)

పద్మావతి అమ్మవారిని పడేశారు.. ఎప్పుడు.. ఎక్కడ...

ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో మరో అపశృతి జరిగింది. అది కూడా సాక్షాత్తు పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తినే కింద పడేశారు ఒక అర్చకుడు. ఇది కాస్తా ప్రస్తుతం భక్తుల్లో తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. తిరుమలలో ఏదైనా అపశృతి జరిగితే ఖచ్చితంగా ఏదో ఒక అనర్థం జరుగు

ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో మరో అపశృతి జరిగింది. అది కూడా సాక్షాత్తు పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తినే కింద పడేశారు ఒక అర్చకుడు. ఇది కాస్తా ప్రస్తుతం భక్తుల్లో తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. తిరుమలలో ఏదైనా అపశృతి జరిగితే ఖచ్చితంగా ఏదో ఒక అనర్థం జరుగుతుందని భక్తులు భావన. అమ్మవారి విగ్రహాన్ని పడేసి ఆ విషయాన్ని కాస్త గోప్యంగా ఉంచారు. 
 
తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉత్సవాల్లో భాగంగా ఆలయంలోపల నుంచి మండపంలోకి స్వామి, అమ్మవార్ల విగ్రహాన్ని చేతిలో పట్టుకుని తీసుకెళుతున్నారు. అయితే ఒక అర్చకుడు పద్మావతి అమ్మవారి విగ్రహాన్ని ఒక్కసారిగా కింద వదిలేశారు. విగ్రహం కాస్త కింద పడిపోయింది. దీంతో భక్తులు గట్టిగా కేకలు వేశారు. అర్చకుడు వెంటనే ఉత్సవమూర్తిని పైకి ఎత్తుకుని తుడిచి అక్కడి నుంచి తీసుకెళ్ళి ఉత్సవాలను పూర్తి చేశారు.
 
ఆ తరువాత ఎవరికీ తెలియకుండా విగ్రహాలను పెట్టి శాంతిహోమం నిర్వహించేశారు. ఉత్సవానికి హాజరైన కొంతమంది భక్తులు టిటిడి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో ఉన్నతాధికారులు అర్చకునిని వివరణ కోరగా వయస్సు  పైబడటంతో చేయి జారి పడిందని వివరణ ఇచ్చారు. దీంతో అర్చకునిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు టిటిడి.