బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 10 జూన్ 2017 (15:04 IST)

గో మూత్రం తాగేవారిని కాల్చిపారేయండి : ఐసిస్ హుకుం

దేవుళ్లను పూజించేవారిని, గో మూత్రం తాగేవారిని జిహాదీలు హ‌త‌మార్చాల‌ని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు హుకుం జారీచేశారు. ఈ మేరకు ఐఎస్‌ఐఎస్‌ తీవ్రవాదులు ప్రచురించిన 8 పేజీల లేఖ ఒకటి వెలుగుచూసింది.

దేవుళ్లను పూజించేవారిని, గో మూత్రం తాగేవారిని జిహాదీలు హ‌త‌మార్చాల‌ని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు హుకుం జారీచేశారు. ఈ మేరకు ఐఎస్‌ఐఎస్‌ తీవ్రవాదులు ప్రచురించిన 8 పేజీల లేఖ ఒకటి వెలుగుచూసింది. అందులో జిహాదీల‌కు ఐఎస్ఐఎస్ ప‌లు సూచ‌న‌లు చేసింది. ఇస్లాంకు ద్రోహం చేసే మత అవిశ్వాసకులను చంపేయాల‌ని పిలుపునిచ్చారు.
 
ముఖ్యంగా భారత్‌కు అధికారులను, రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ గూఢచారులను, పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ అధికారుల‌ను మ‌ట్టుబెట్టాల‌ని ఆదేశించింది. వీరంతా మతానికి ద్రోహం చేస్తున్నారు కాబ‌ట్టి అల్లా ప్రకారం వారంద‌రూ శిక్షార్హులేనని తెలిపింది.
 
త‌మ మ‌తాన్ని న‌మ్మ‌ని వారికి వ్యతిరేకంగా జమ్ముకాశ్మీర్‌లోని ముస్లింలు తిరుగుబాటు చేస్తున్న‌ప్ప‌టికీ, వారు స్వాతంత్ర్యం కోసం మాత్ర‌మే పోరాడుతున్నార‌ని పేర్కొంది. పాకిస్థాన్‌లోని చాలా మంది ముస్లింలు తమ మతానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని ఐసిస్ ఉగ్రవాదులు పేర్కొన్నారు.