మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 2 జులై 2018 (09:44 IST)

పొద్దు తిరుగుడు గింజలు.. పనీర్‌తో మేలెంతో తెలుసా?

పొద్దు తిరుగుడు గింజలు గుండెకు ఎంతో మేలు చేస్తాయి .45 గ్రాముల గింజల్లో 15 మిల్లీగ్రాముల విటమిన్‌-ఇ ఉంటుంది. వీటిలో ఎక్కువగా ఉండే యాంటిఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడతాయి. ఈ గింజల్ని

పొద్దు తిరుగుడు గింజలు గుండెకు ఎంతో మేలు చేస్తాయి .45 గ్రాముల గింజల్లో 15 మిల్లీగ్రాముల విటమిన్‌-ఇ ఉంటుంది. వీటిలో ఎక్కువగా ఉండే యాంటిఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడతాయి. ఈ గింజల్ని నేరుగా తినడం ఇష్టం లేకపోతే సలాడ్లూ, సూపుల్లో చేర్చుకోవచ్చు. ఇంకా బాదం పప్పుల్లో పోషకాలు ఎక్కువ. 
 
రోజూ నాలుగైదు బాదం తీసుకుంటే చాలు. అలాగే వంద గ్రాముల టోఫు.. అంటే సోయా పాలతో చేసిన పనీర్‌లో ఐదు మిల్లీగ్రాముల విటమిన్‌-ఇ ఉంటుంది. ఇది తినడం ఇష్టం లేని వారు తీపి పదార్థాల్లో దీన్ని చేర్చుకోవచ్చునని.. తద్వారా గుండెకు మేలు జరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాగే రెండు పూటలా ఆకుకూర తింటే మన శరీరానికి తగిన ఇనుము లభిస్తుంది. ఇంకా పావుకప్పు టొమాటో గుజ్జు నుంచి రోజువారీ ఆహారంలో తప్పక చేర్చుకున్నట్లైతే అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.