మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : శనివారం, 30 జూన్ 2018 (13:08 IST)

ఉప్పు లేకుండా వేయించిన వేరుశెనగలు తీసుకుంటే...?

రక్తపోటును నియంత్రించాలంటే శరీరంలో క్యాల్షియం స్థాయి తగినంతగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి సమస్యలు ఉన్నవారు రోజు క్యాల్షియం సమృద్ధిగా అందే కొవ్వు లేని వెన్న తీసిన పాలు, పాల ఉత్పత్తుల

రక్తపోటును నియంత్రించాలంటే శరీరంలో క్యాల్షియం స్థాయి తగినంతగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి సమస్యలు ఉన్నవారు రోజు క్యాల్షియం సమృద్ధిగా అందే కొవ్వు లేని వెన్న తీసిన పాలు, పాల ఉత్పత్తులు వంటివి తీసుకోవాలి. పెరుగు రోజూ తీసుకోవడం వలన రక్తపోటును నియంత్రించవచ్చును.
 
శరీరానికి కావాలసిన పొటాషియం అందాలంటే అరటిపండ్లు, బత్తాయి, దోసకాయ, టమాటాలు, ఉప్పు లేకుండా వేయించిన వేరుశెనగ, బీన్స్, బంగాళాదుంపలు, మునగాకు, కొత్తిమీర వంటివి తీసుకోవాలి. వీటిలో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. ముఖ్యంగా రక్తపోటును నియంత్రించాలంటే ముఖ్యంగా రోజు ఆహారంలో తాజా కూరగాయలు, తృణధాన్యాలు, పండ్లు, గింజలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.