ఆదివారం, 12 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : సోమవారం, 2 జులై 2018 (13:26 IST)

రాత్రిపూట దిండు క్రింద వెల్లుల్లి పెట్టుకుని నిద్రిస్తే?

ఆరోగ్యానికి సహకరించే ఎన్నో గుణాలు వెల్లుల్లిలో ఉన్నాయి. వెల్లుల్లిని ఆహారంగా తీసుకోకపోయినా పడుకునే దిండు క్రింద పెట్టుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. వెల్లుల్లిలో ఉండే వేడి, అరోమా మెదుడులోని పలు ప్రా

ఆరోగ్యానికి సహకరించే ఎన్నో గుణాలు వెల్లుల్లిలో ఉన్నాయి. వెల్లుల్లిని ఆహారంగా తీసుకోకపోయినా పడుకునే దిండు క్రింద పెట్టుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. వెల్లుల్లిలో ఉండే వేడి, అరోమా మెదుడులోని పలు ప్రాంతాలను ఉత్తేజితం చేస్తాయి. దీంతో నిద్రలేమి దూరమవుతుంది. రోజు దిండు క్రింద ఒక వెల్లుల్లి రెబ్బను పెట్టుకుని పడుకుంటే నిద్ర చక్కగా పడుతుంది.
 
జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు దిండు క్రింద వెల్లుల్లిని పెట్టుకుని నిద్రిస్తే మంచిది. ఇలా చేయడం వలన గుండె సంబంధిత వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చును. రక్తనాళాల్లో ఉన్న అడ్డంకులు తొలిగిపోతాయి. లివర్ సంబంధ సమస్యలు దూరమవుతాయి. హార్మోన్ సమస్యలు దూరమై జీవక్రియలు సక్రమంగా సాగుతాయి.