సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 29 జూన్ 2018 (14:26 IST)

పుదీనా టీ.. రోజుకో కప్పు సేవిస్తే?

పుదీనా ఆకులు శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. గుప్పెడు పుదీనా ఆకులను రసంగా పిండుకుని తాగితే.. శరీరం చల్లబడుతుంది. అలాగే రోజుకో కప్పు పుదీనా టీ సేవిస్తే.. అనారోగ్య సమస్యలు దరిచేరవు. బరువు తగ్గుతార

పుదీనా ఆకులు శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. గుప్పెడు పుదీనా ఆకులను రసంగా పిండుకుని తాగితే.. శరీరం చల్లబడుతుంది. అలాగే రోజుకో కప్పు పుదీనా టీ సేవిస్తే.. అనారోగ్య సమస్యలు దరిచేరవు. బరువు తగ్గుతారు. ఇక పెరుగు, మజ్జిగలో శరీరానికి కావలసిన పోషకాలు ఉంటాయి. విటమిన్లూ, పోషకపదార్థాలున్న పెరుగును వర్షాకాలంలో మితంగా తీసుకోవాలి. 
 
అలాగే కొత్తిమీరను ఆహారంలో అధికంగా తీసుకోవాలి. కొత్తిమీర రసం లేదా వంటకాల్లో దీన్ని వాడినా... శరీరంలోని అధిక ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. శరీరం వేడైనట్లు అనిపిస్తే.. సబ్జాగింజల్ని నీటిలో అరగంట పాటు నానబెట్టి.. అందులో కాసింత నిమ్మరసాన్ని కలిపి తాగితే సరిపోతుంది. ఈ జ్యూస్ ద్వారా సులభంగా బరువు తగ్గొచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.