శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. గృహాలంకరణ
Written By Kowsalya
Last Updated : బుధవారం, 4 జులై 2018 (17:46 IST)

ఇంట్లో పింగాణీ పాత్రలు ఎలా వాడాలంటే?

ఇంటికి అందానిచ్చే వస్తువులను అధికంగా కొంటుంటారు. అందులో పింగాణీ పాత్రలు అందంతో పాటు ఆకర్షణీయంగా ఉంటాయి. వీటిని కొనే ముందు చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే మంచిది. పింగాణీ పాత్రలను బ్లూ పాటరీతో తయారయ్యే వస్తువులను అధికంగా అచ్చులు ఉపయోగించి తయారుచేస్తుంటా

ఇంటికి అందానిచ్చే వస్తువులను అధికంగా కొంటుంటారు. అందులో పింగాణీ పాత్రలు అందంతో పాటు ఆకర్షణీయంగా ఉంటాయి. వీటిని కొనే ముందు చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే మంచిది. పింగాణీ పాత్రలను బ్లూ పాటరీతో తయారయ్యే వస్తువులను అధికంగా అచ్చులు ఉపయోగించి తయారుచేస్తుంటారు.
 
వీటిని కొనేటప్పుడు జాయింట్ల వద్ద హోల్స్, పగుళ్లు ఏర్పడని పాత్రలను ఎన్నిక చేసుకుంటే మంచిది. రంగులు వేసి ఉన్న పింగాణీ పాత్రలను కొనేటప్పుడు వాటిపై వేసి ఉన్న పెయింటింగ్ పాత్రకు అందాన్నిచ్చే విధంగా ఉండేటట్టు చూసుకోవాలి. బ్లూ పాటరీ పాత్రలను ఆకర్షణ కోసం అందరూ కొంటుంటారు. ఈ పాత్రలను కొనేటప్పుడు రంగు గానీ గ్లేజ్ కానీ పెచ్చులుగా ఉండకుండా పూతను సరిగ్గా గమనించి తీసుకోవాలి. 
 
పలురకాల సైజుల్లో నీలి రంగు, ఎరుపు రంగులతో పాటు బేస్ మెటల్‌గా తయారు చేసే పింగాణీ పాత్రలను ఎంచుకోవచ్చును. వీటికి మీకు నచ్చిన ఫ్లవర్స్‌తో డెకరేట్ చేసుకుని డైనింగ్ టేబుల్, సోఫా టేబుల్ మీద అలంకరిస్తే అధిక ఆకర్షణ నిస్తాయి. ఇంటికి ప్రత్యేక అందాన్నిస్తాయి.