సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 16 జులై 2018 (11:55 IST)

కీరదోసను సలాడ్‌లో చేర్చుకుంటే.. హైబీపీ ఇట్టే తగ్గిపోతుంది..

కీరదోసను తీసుకోవడం ద్వారా బీపీ ఇట్టే తగ్గిపోతుంది. కీరదోసలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కీరదోసలో 90 శాతం నీరే ఉంటుంది. దాంతోపాటు ఖనిజలవణాలు కూడా చాలా ఎక్కువ. కీరదోసలో పొటాషియమ్‌ పాళ్లు చాలా ఎక్కువ

కీరదోసను తీసుకోవడం ద్వారా బీపీ ఇట్టే తగ్గిపోతుంది. కీరదోసలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కీరదోసలో 90 శాతం నీరే ఉంటుంది. దాంతోపాటు ఖనిజలవణాలు కూడా చాలా ఎక్కువ. కీరదోసలో పొటాషియమ్‌ పాళ్లు చాలా ఎక్కువ. హైబీపీ ఉన్నవారు క్రమం తప్పకుండా దీన్ని తీసుకుంటే అది రక్తపోటును నియంత్రించవచ్చు. 
 
కీరదోసలో పీచు పాళ్లు చాలా ఎక్కువగా ఉండటం వల్ల అది దేహంలోకి చక్కెరను నెమ్మదిగా విడుదలయ్యేలా చేస్తుంది. దీంతో మధుమేహం అదుపులో వుంటుంది. కీరదోసలో పీచుపదార్థాలు పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థను శుభ్రపరచడంతో పాటు జీర్ణశక్తికి దోహదపడుతుంది.
 
కీరదోసలోని యాంటీఆక్సిడెంట్స్‌ అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తాయి. కీరదోస ముఖ్యంగా మహిళల్లో రొమ్ముక్యాన్సర్లు, పురుషుల్లో ప్రోస్టేట్‌ క్యాన్సర్లను నివారిస్తుంది. కీరదోస శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపుతుంది. కాలేయాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. మూత్రపిండాలపై పడే అదనపు భారాన్ని తొలగిస్తుంది. రక్తంలోని కొలెస్ట్రాల్‌ పాళ్లను అదుపులో ఉంచి, గుండెజబ్బులను నివారిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.