గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 15 జులై 2018 (12:59 IST)

పేగుల్లోని సూక్ష్మ క్రిముల నిర్మూలనకు కాన్‌బెర్రీలు

ప్రకృతి ప్రసాదించిన పండ్లలో కాన్‌బెర్రీ పండ్లు ఒకటి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లను ఆరగించడం ల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి. ఎరుపు రంగులో చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా కనిపిం

ప్రకృతి ప్రసాదించిన పండ్లలో కాన్‌బెర్రీ పండ్లు ఒకటి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లను ఆరగించడం ల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి. ఎరుపు రంగులో చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా కనిపించే ఈ పండ్లలో ఎన్నో ముఖ్యమైన మినరల్స్, విటమిన్లు ఉంటాయి. నిజానికి క్రాన్‌బెర్రీలను పలు తీపి వంటకాల్లో వేస్తుంటారు. దీంతో ఆయా వంటకాలకు చక్కని రుచి, రంగు వస్తాయి. అయితే క్రాన్‌బెర్రీలను ఆరగించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పరిశీలిద్ధాం.
 
* ఈ పండ్లను ఆరగించడం వల్ల వీటిలోని ప్రొ ఆంథోసయనిడిన్స్ అనబడే సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ముఖ్యంగా, జీర్ణాశయం, పేగుల్లో ఉండే సూక్ష్మ క్రిములు నాశనమవుతాయి. 
 
* ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవన్నీ మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే చర్మ సంరక్షణకు, కండరాలు, ఎముకల నిర్మాణానికి ఇవి పనికొస్తాయి. హైబీపీ తగ్గుతుంది.
 
* క్రాన్‌బెర్రీలను తరచూ తినడం వల్ల గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. పాలిఫినాల్స్ వీటిల్లో అధికంగా ఉంటాయి. అందువల్ల రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) పోయి మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. 
 
* ముఖ్యంగా క్రాన్‌బెర్రీలు చర్మ సంరక్షణకు ఎంతగానో పనికొస్తాయి. వీటిల్లో ఉండే ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ ఏజెంట్లు చర్మాన్ని సంరక్షిస్తాయి.