రోజుకు ఐదంటే ఐదు చాలు...  
                                          ద్రాక్ష పండ్లను ఇష్టపడని వారుండరు. అయితే, పచ్చి ద్రాక్షలో కంటే ఎండు ద్రాక్షలోనే పోషకాలు పుష్కలంగా ఉంటాయని న్యూట్రిషనిస్టులు చెపుతున్నారు. అందుకే రోజుకు 5 ఎండు ద్రాక్షలను తింటే చాలని వారు అంటున్నారు.
                                       
                  
				  				  
				   
                  				  ద్రాక్ష పండ్లను ఇష్టపడని వారుండరు. అయితే, పచ్చి ద్రాక్షలో కంటే ఎండు ద్రాక్షలోనే పోషకాలు పుష్కలంగా ఉంటాయని న్యూట్రిషనిస్టులు చెపుతున్నారు. అందుకే రోజుకు 5 ఎండు ద్రాక్షలను తింటే చాలని వారు అంటున్నారు. దీనికి కారణం ఈ ఎండు ద్రాక్షలో ఐరన్, కాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉండటమేకాకుండా, సహజసిద్ధంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని అంటున్నారు. ఈ ఎండు ద్రాక్ష ఆరగిస్తే కలిగే లాభాలను ఓసారి పరిశీలిద్ధాం.
	
				  
	 
	* ఇందులో ఉండే ఫైబర్ వల్ల ఉదర సంబంధిత సమస్యలు దరిచేరవు. ప్రతిరోజు రాత్రి ఒక గ్లాసు పాలు, 10 ఎండు ద్రాక్షలు తీసుకోవడం వల్ల ఉదర సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 
				  											
																													
									  
	* పొటాషియం నరాలు, కండరాలు ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. 
	* ఎండు ద్రాక్షలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ప్రతి రోజూ ఓ కప్పు నీటిలో 10 నుంచి 15 ఎండు ద్రాక్షలను నానబెట్టాలి. దీనిలో కొద్దిగా నిమ్మరసం కలపాలి. 4 - 5 గంటల  తర్వాత ఎండు ద్రాక్షను నమలాలి. ఇలాక్రమం తప్పకుండా చేస్తే అనీమియా వ్యాధి దూరమవుతుంది. 
				  
	* ఎండు ద్రాక్షలో ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇవి పళ్లను, చిగుళ్లను దృఢంగా ఉండేలా చేస్తాయి. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	* యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల కేన్సర్ కారక కణాలను నాశనం చేస్తాయి. 
	* ఎండు ద్రాక్షను క్రమం తప్పకుండా ఆరగించడం వల్ల ఇందులోని క్యాల్షియం కీళ్ల నొప్పులను మటుమాయం చేస్తుంది. 
				  																		
											
									  
	* అన్నిటికంటే ముఖ్యంగా, ప్రతిరోజు ఎండు ద్రాక్షను తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన మలినాలను బయటకు పోతాయి. కాలేయ సంబంధ సమస్యలను నివారిస్తుంది. 
				  																	
									  
	* ఎండు ద్రాక్షలో బీటా కెరోటిన్, విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇవి కంటి చూపును మెరుగుపడటానికి సాయపడతాయి. 
				  																	
									  
	* పిల్లల శరీరానికి ఎండుద్రాక్ష సహజమైన వేడిని అందిస్తుంది. దీనివల్ల పిల్లలు రాత్రిపూట పక్కలో మూత్రవిసర్జన చేయరు. 
				  																	
									  
	* ఎండు ద్రాక్షలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.