మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : శుక్రవారం, 27 జులై 2018 (08:44 IST)

శుక్రవారం (27-07-18) దినఫలాలు - మీరు చేపట్టిన పనులు...

మేషం : ఉద్యోగస్తులకు అధికారులతో అవగాహన, తోటివారితో సత్సంబంధాలు నెలకొంటాయి. నిరుద్యోగులకు, అవివాహితులకు ఆశాజనకం. చిన్నతరహా పరిశ్రమలు, వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా ఆర్థిక సంతృప్తి ఉండదు. సిమెంట్, ఐర

మేషం : ఉద్యోగస్తులకు అధికారులతో అవగాహన, తోటివారితో సత్సంబంధాలు నెలకొంటాయి. నిరుద్యోగులకు, అవివాహితులకు ఆశాజనకం. చిన్నతరహా పరిశ్రమలు, వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా ఆర్థిక సంతృప్తి ఉండదు. సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారస్తులకు పురోభివృద్ధి. అవివాహితులకు అనుకూలం.
 
వృషభం : స్త్రీలు ఆభరణాలు, నూతన వస్త్రాలు సమకూర్చుకుంటారు. గృహంలో ఏదైనా వస్తువు పోయేందుకు ఆస్కారం ఉంది, మెళకువ వహించండి. విద్యార్థులు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. పాత మిత్రుల కలయికతో మీలో కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి.
 
మిథునం : విద్యార్థులు ఉన్నత విద్యల కోసం చేసే విదేశీయాన యత్నాల్లో ఆటంకాలు తొలగిపోగలవు. ఏదైనా శుభకార్యం చేయాలనే సంకల్పం బలపడుతుంది. నూనె, శనగ, మినుము వ్యాపారులకు, స్టాకిస్టులకు ఆశాజనకం. గృహంలో మార్పులు, చేర్పులు చేపడతారు. రావలసిన బాకీలు కొంతమేర వసూలు కాగలవు.
 
కర్కాటకం : కాంట్రాక్టర్లకు కార్మికులతో అవగాహన లోపిస్తుంది. ఉద్యోగస్తులు సమర్థవంతంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు పురోభివృద్ధి. మీరు చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా పూర్తవుతాయి. జాయింట్ వ్యాపారాలు, లీజు, ఏజెన్సీలు అనుకూలిస్తాయి.
 
సింహం : ఉద్యోగస్తులకు తోటివారి నుంచి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన త్వరలో కార్యరూపం దాల్చుతుంది. కోర్టు వ్యవహారాలు, స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో మెలకువ వహించండి. షేర్లు సామాన్య లాభానికే విక్రయించాల్సి వస్తుంది. స్పెక్యులేషన్ కలసిరాదు.
 
కన్య : రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఇతరుల వల్ల మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. కిరాణా, ప్యాన్సీ, వస్త్ర వ్యాపారాలు ఊపందుకుంటాయి. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఆశాజనకం. ఏదయినా అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. షేర్లు సామాన్యం.
 
తుల : వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. సాహసించి మీరు తీసుకున్న నిర్ణయంయ మంచి ఫలితాలను ఇస్తుంది. అర్ధాంతరంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఒకసారి జరిగిన తప్పిదం పునరావృతం కాకుండా జాగ్రత్త పడండి. దైవ దర్శనాలవల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. స్నేహ పరిచయాలు విస్తరిస్తాయి.
 
వృశ్చికం : ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాలు, సంప్రదింపులకు సంబంధించిన విషయాలలో ఏకాగ్రత అవసరం. రుణం ఏ కొంతయినా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. మిత్రుల ద్వారా అందిన ఒక సమాచారం మీకెంతగానో ఉపకరిస్తుంది. స్త్రీలు సన్నిహితుల నుండి కొత్త విషయాలను గ్రహిస్తారు. శుభవార్తలు వింటారు.
 
ధనస్సు : ఉద్యోగస్తుల సమర్థతకు పై అధికారుల నుండి గుర్తింపు, మన్ననలు లభిస్తాయి. గృహంలో ఒక శుభకార్యం నిమిత్తం యత్నాలు మొదలెడతారు. ఏ విషయంలోనూ ఎదుటివారిని అతిగా విశ్వసించటం మంచిది కాదని గమనించండి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మెడికల్ కోర్సులలో ప్రవేశం లభిస్తుంది.
 
మకరం : స్త్రీలు నోములు, వ్రతాలపట్ల ఆసక్తి కనబరుస్తారు. మీ దైనందిన కార్యక్రమాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి. వస్త్ర, బంగారం, వెండి వ్యాపారుల్లో పోటీతత్వం పెరుగుతుంది. స్థిరాస్తి క్రయవిక్రయాల్లో ప్రముఖుల సలహాలు పాటించంట మంచిది. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలపట్ల ఆసక్తి కనబరుస్తారు.
 
కుంభం : ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్త్రీల సృజనాత్మకతకు, ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. కంప్యూటర్, ఎలక్ట్రానికల్ రంగాల్లోని వారికి లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులు ఉన్నత విద్యల కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. సమయానుకూలంగా మీ కార్యక్రమాలను వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.
 
మీనం : శుభకార్యం నిమిత్తమై, సంతానం విషయమై ధనం బాగా వ్యయం చేస్తారు. స్త్రీలకు పనివారలు, చుట్టుప్రక్కల వారితో చికాకులు అధికమవుతాయి. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. సాంఘిక, సాంస్కృతిక, సినిమా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.