శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : శనివారం, 28 జులై 2018 (08:42 IST)

శనివారం (28-07-2018) దినఫలాలు - స్త్రీలు అనవసరపు విషయాల్లో...

మేషం: స్వర్ణకారులు, బులియన్ వ్యాపారులకు ఊహించని చికాకులు తలెత్తుతాయి. మీ యత్నాలకు మీ శ్రీమతి ప్రోత్సాహం లభిస్తుంది. కష్టకాలంలో ఆత్మీయులు అండగా నిలుస్తారు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాల్లో మార్పులుండ

మేషం: స్వర్ణకారులు, బులియన్ వ్యాపారులకు ఊహించని చికాకులు తలెత్తుతాయి. మీ యత్నాలకు మీ శ్రీమతి ప్రోత్సాహం లభిస్తుంది. కష్టకాలంలో ఆత్మీయులు అండగా నిలుస్తారు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాల్లో మార్పులుండవు. స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం వలన భంగపాటుకు గురవుతారు.
 
వృషభం: ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. ఆత్మీయుల గురించి ఆందోళన చెందుతారు. శస్త్రచికిత్సల సమయంలో వైద్యరంగాల వారికి ఏకాగ్రత ముఖ్యం. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ అధికారుల నుండి అభ్యంతరాలెదుర్కోవలసివస్తుంది. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు.  
 
మిధునం: ఒక స్థిరాస్తి సమకూర్చుకోవాలనే ఆలోచన స్పురిస్తుంది. ఊహించని ఖర్చుల వలన స్వల్ప ఆటుపోట్లు తప్పవు. లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్ల వ్యవహారాల్లో పునరాలోచన అవసరం. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడుతాయి. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. 
 
కర్కాటకం: బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. నూతన పరిచయాలు, వ్యాపకాలు ఏర్పడుతాయి. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. సోదరీసోదరులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. 
 
సింహం: భార్య, భర్తల ఆలోచనలు, అభిప్రాయబేధాలు భిన్నంగా ఉంటాయి. మిమ్మల్ని పొగిడే వారేకానీ సహకరించే వారుండరు. కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. మెలకువ వహించండి. క్యాటరింగ్, స్టేషనరీ ప్రింటింగ్ రంగాలవారికి ఆశాజనకరం. హామీలు, మధ్య వర్తిత్వాలకు దూరంగా ఉండడం క్షేమదాయకంగా ఉంటుంది.
 
కన్య: ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి లాభదాయకంగా ఉంటుంది. బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. రాజకీయాల వారు కార్యకర్తల వలన సమస్యలను ఎదుర్కొనక తప్పదు. మిత్రుల నుండి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి.  
 
తుల: ఉద్యోగస్తులకు ఆకస్మిక అభిప్రాయ భేదాలు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. అకాలభోజనం, శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వలన అప్పుడప్పుడు అస్వస్థతకు గురవుతారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలు కళా రంగాల్లో రాణిస్తారు. వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత వహించండి. 
 
వృశ్చికం: ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభించాలనే ఆలోచన స్పురిస్తుంది. మిత్రుల కలయికతో ప్రశాంతతను పొందుతారు. ఆస్థి పంపకాలకు సంబంధించి కుటుంబీకులతో అవగాహన ఏర్పడుతుంది. విద్యార్థులకు వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. వైద్యులకు ఏకాగ్రత చాలా అవసరం. 
 
ధనస్సు: ఉద్యోగస్తులు స్థానమార్పిడికి చేయు యత్నాలలో  స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. సహచరుల సలహావలన నిరుద్యోగులు సదవకాశాలు జారవిడుచుకుంటారు. చేనేత, ఖాదీ, నూలు, కలంకారీ వస్త్ర వ్యాపారులకు పురోభివృద్ధి. రుణం కొంత మెుత్తం తీర్చడంలో ఒత్తిడి నుండి కుదుటపడుతారు. 
 
మకరం: దూరప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. విద్యార్థులకు ఉన్నత కోర్సులలో అవకాశాలు లభిస్తాయి. హోటల్, క్యాటరింగ్ రంగాల్లోవారు పనివారలతో ఇబ్బందులు ఎదుర్కుంటారు. స్త్రీలకు పుట్టింటివారి మీద ధ్యాస మళ్ళుతుంది. కంప్యూటర్, ఎలక్ట్రానిక్, టెక్నికల్ రంగాల్లో వారికి అభివృద్ధి కానవస్తుంది. 
 
కుంభం: చేపట్టిన పనులు కొంత ఆలస్యంగా నయినా పూర్తికాగలవు. స్త్రీలకు ఆహార, ఆరోగ్య విషయంలో తగుజాగ్రత్తలు అవసరం. ప్రముఖులను కలుసుకుంటారు. ఉపాధ్యాయులు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఆదాయ వ్యయాల్లో ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తారు. మీ సంతానం పై చదువుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. 
 
మీనం: బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. రహస్య విరోధులు అధికం కావడం వలన రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. సంతానంతో అభిప్రాయ బేధాలు వస్తాయి. బ్యాంకు పనులు చురుకుగా సాగుతాయి.