శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 10 ఆగస్టు 2018 (17:03 IST)

'నీలమణి'ని ఉంగరంలో ధరిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

గ్రహ దోషాలు మానవుల జీవితాలను ప్రభావితం చేస్తుంటాయని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప్పబడుతోంది. గ్రహాల దోషాల బారిన పడినవాళ్లు ఆ దోషాల నుండి విముక్తులు కావడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా శనిదోషం అనగ

గ్రహ దోషాలు మానవుల జీవితాలను ప్రభావితం చేస్తుంటాయని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప్పబడుతోంది. గ్రహాల దోషాల బారిన పడినవాళ్లు ఆ దోషాల నుండి విముక్తులు కావడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా శనిదోషం అనగానే చాలామంది తీవ్రమైన ఆందోళనకు లోనవుతుంటారు. శని గ్రహదోషాల కారణంగా ఎలాంటి కష్టాలు ఎదుర్కోవలసి వస్తుందోనని, ఎలాంటి ఇబ్బందులు పడవలసి వస్తుందోనని ఆందోళన చెందుతుంటారు.
 
శని దేవుని శాంతింపజేయడానికి పూజలు, అభిషేకాలు, దానాలు చేయవలసి వస్తుంది. అంతేకాకుండా మూగ జీవుల పట్ల కరుణ చూపించడం వలన కూడా శనిదేవుడు ప్రీతి చెందుతాడు. తద్వారా శనిదోషాలు తొలగిపోయే అవకాశాలున్నాయని శాస్త్రంలో స్పష్టం చేయబడుతోంది. పక్షులకు, చీమలకు ఆహారాన్ని అందించడం వలన కూడా శనిదోషాలు తొలగిపోతాయి. 
 
శనిదేవునికి ఇష్టమైన సప్తముఖి రుద్రాక్షను ధరించడం వలన, నీలమణిని ఉంగరంలో వేసుకోవడం వలన శనిదోషాల ప్రభావం తగ్గుముఖం పడుతాయి. అందువలన శనిదేవుని నుండి ప్రతికూల ఫలితాలను పొందుతున్నవారు, అనుకూల ఫలితాలకోసం ఇలాంటివి చేయవలసి వస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప్పబడుతోంది.