పులిపిరులతో బాధపడుతున్నారా? ఈ చిట్కాలు పాటిస్తే...
పులిపిర్లు తొలగిపోవడానికి ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. ఆముదంలో కొద్దిగా బేకింగ్ సోడాను కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తరుచుగా చర్మానికి రాసుకోవాలి. కాసేపటి తరువాత
పులిపిర్లు తొలగిపోవడానికి ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. ఆముదంలో కొద్దిగా బేకింగ్ సోడాను కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తరుచుగా చర్మానికి రాసుకోవాలి. కాసేపటి తరువాత సూదితో గుచ్చినట్లనిపిస్తుంది. ఆ తీవ్రత ఎక్కువగా ఉంటే కడిగేసుకుంటే మంచిది.
నిమ్మరసాన్ని పులిపిరులపై రాసుకుని రాత్రంతా అలానే ఉంచుకోవాలి. రోజూ ఇలా చేయడం వలన తప్పక ఫలితం కనిపిస్తుంది. ఓ కాటన్ బాల్‌ను తీసుకుని యాపిల్ సైడర్ వెనిగర్‌లో ముంచి పులిపిర్లపై రాసుకోవాలి. ఈ పద్ధతి కొద్దిగా పిన్‌తో గుచ్చినట్లుంటుంది. అప్పుడే పులిపిరులు తొలగిపోతాయి.
ఉల్లిపాయల్ని తీసుకుని గ్లాస్ ఉప్పు నీటిలో కాసేపు నానబెట్టుకోవాలి. ఆ నీటిని చర్మ భాగాలపై రాసుకుని పరిశుభ్రమైన గుడ్డతో కప్పేయాలి. రాత్రంతా అలానే ఉంచుకోవాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారం రోజులపాటు ప్రతిరోజూ చేయడం వలన పులిపిరులు తొలగిపోయి ఉపశమనం లభిస్తుంది.