శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : శనివారం, 28 జులై 2018 (14:40 IST)

వంటసోడాను ముఖానికి రాసుకుంటే... నల్లటి వలయాలు తొలగిపోతాయా?

ఈ కాలంలో ముఖం పొడిబారడం జరుగుతుంది. అలాంటి వారి ఈ చిట్కాలు పాటిస్తే మంచిది ఫలితాలను పొందవచ్చును. గులాబీ నీటిలో కాస్త నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత టమోటా గుజ్జును రాసుకోవాలి. కాస

ఈ కాలంలో ముఖం పొడిబారడం జరుగుతుంది. అలాంటి వారి ఈ చిట్కాలు పాటిస్తే మంచిది ఫలితాలను పొందవచ్చును. గులాబీ నీటిలో కాస్త నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత టమోటా గుజ్జును రాసుకోవాలి. కాసేపటికి తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయడం వలన ముఖం కాంతివంతంగా, అందంగా మారుతుంది.
 
బంగాళాదుంపని మెత్తగా గుజ్జులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది. వంటసోడాలో కొద్దిగా నీటిని కలుపుకుని ముక్కు భాగానికి రాసుకుంటే నల్లటి వలయాలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ వంటసోడాను జుట్టుకు రాసుకుంటే కూడా వెంట్రుకలు రాలడం తగ్గిపోతుంది. 
 
కొబ్బరినూనెలో కాసేపు వేడిచేసి అందులో కరివేపాకులను వేసుకోవాలి. ఆ నూనె చల్లారిన తరువాత తలకు పట్టించాలి. ఇలా చేయడం వలన వెంట్రుకలు రాలిపోవడం తగ్గిపోతుంది. అలానే నల్లగా కూడా మారుతాయి.