ఆదివారం, 12 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : బుధవారం, 25 జులై 2018 (14:55 IST)

చర్మసౌందర్యాన్ని పెంచే బ్యూటీ చిట్కాలు...

మహిళలు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచుకటు రకరకాల క్రీములు, పౌడర్లు, సబ్బులు వాడుతుంటారు. కానీ కొందమందికి ఇలాంటివి పడవు. అటువంటి వారు సహజ సిద్ధమైన పద్ధతిలో చర్మం సౌందర్యాన్ని పొందేందుకు ఈ చిట్కాలు పాటిస్త

మహిళలు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచుకటు రకరకాల క్రీములు, పౌడర్లు, సబ్బులు వాడుతుంటారు. కానీ కొందమందికి ఇలాంటివి పడవు. అటువంటి వారు సహజ సిద్ధమైన పద్ధతిలో చర్మం సౌందర్యాన్ని పొందేందుకు ఈ చిట్కాలు పాటిస్తే సరి.
 
గంధం పొడిలో కొద్దిగా నిమ్మరసం, కీరదోస రసం, టమోటా రసం కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం కాంతివంతంగా మారుతుంది. పాలపొడిలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి.
 
15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడుక్కుకోవాలి. ఇలా చేయడం వలన ముఖచర్మం మృదువుగా మారుతుంది. బాదం పప్పును రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి. ఉదయాన్నే వాటి పొట్టును తీసి బాదం పప్పులను పేస్ట్‌లా చేసుకోవాలి. అందులో తేనెను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 10 నిమిషాల తరువాత కడిగేయాలి.
 
పెరుగులో నారింజ రసాన్ని కలుపుకుని ముఖానికి రాసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. బంగాళాదుంప పొట్టును జ్యూస్‌లా చేసుకుని ముఖానికి రాసుకుంటే నల్లటి మచ్చలు తొలగిపోతాయి.