శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 24 జులై 2018 (14:33 IST)

వరుస ఫ్లాపులతో జ్ఞానోదయమైంది...

మెగా ఫ్యామిలీకి చెందిన హీరోల్లో సాయి ధరమ్ తేజ్ ఒకరు. ఈయన సినీ కెరీర్ ఆరంభంలో వరుస విజయాలతో దూసుకెళ్లినప్పటికీ.. ఆ తర్వాత సాయి గ్రాఫ్ కిందకు పడిపోసాగింది. ఒకటి కాదు.. రెండు ఏకంగా ఆరు చిత్రాలు వరుసబెట్ట

మెగా ఫ్యామిలీకి చెందిన హీరోల్లో సాయి ధరమ్ తేజ్ ఒకరు. ఈయన సినీ కెరీర్ ఆరంభంలో వరుస విజయాలతో దూసుకెళ్లినప్పటికీ.. ఆ తర్వాత సాయి గ్రాఫ్ కిందకు పడిపోసాగింది. ఒకటి కాదు.. రెండు ఏకంగా ఆరు చిత్రాలు వరుసబెట్టి ఫ్లాపులయ్యాయి. తాజాగా వచ్చిన తేజ్ ఐ లవ్ యూ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో ఈ మెగా హీరో కష్టాల్లో పడ్డాడు.
 
ఈ వరుస పరాజయాలకు కొన్ని బలమైన కారణాలు లేకపోలేదు. వాటిలో రొటీన్ రెగ్యులర్ ఫార్మాట్లో కథల్ని ఎంచుకుంటుండటం, కేవలం కమర్షియాలిటీకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, లుక్ సరిగా లేకపోవడం. 
 
దీంతో ఇక లాభం లేదనుకున్న తేజ్ ఇకపై మూస కథల్నికాకుండా కొంచెం కంటెంట్ ఉండే కథల్ని ఎంచుకోవాలని భావిస్తున్నాడట. అంతేకాదు బరువు తగ్గి బాడీ షేప్ కూడా మార్చాలని ఫిక్సయ్యారు. అందుకే ఉన్నఫళంగా ఒక  మూడు నెలలు సెలవు ప్రకటించుకున్నారని, బరువు తగ్గాకే కొత్త సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టాలని భావిస్తున్నారట.