శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 24 జులై 2018 (17:44 IST)

అరటి పండు తొక్కతో మెుటిమలు తొలగిపోతాయా?

మెుటిమలు కేవలం ఆడవారికే కాదు మగవారికి వస్తుంటాయి. కానీ కొందరి ముఖాల్లో మాత్రం నిరంతరంగా మెుటిమలు ఏర్పడుతునే ఉంటాయి. అలా ఏర్పడే మెుటిమలను తొలగిపోవడానికి ఈ కింది చిట్కాలు పాటిస్తే సరి.

మెుటిమలు కేవలం ఆడవారికే కాదు మగవారికి వస్తుంటాయి. కానీ కొందరి ముఖాల్లో మాత్రం నిరంతరంగా మెుటిమలు ఏర్పడుతునే ఉంటాయి. అలా ఏర్పడే మెుటిమలను తొలగిపోవడానికి ఈ కింది చిట్కాలు పాటిస్తే సరి.
 
టీ ట్రీ ఆయిల్‌ను మెుటిమలపై రాసుకుంటే కొన్నిరోజుల తరువాత ముఖం కాంతివంతంగా మారుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్‌లో దానికి తగినన్ని నీటిని కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందుగా మెుటిమలపై రాసుకోవాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేయాలి. 2 స్పూన్స్ తేనెలో 1 స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 
 
15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా చేయడం వలన మెుటిమల వలన ఏర్పడిన మచ్చలు తొలగిపోతాయి. అరటిపండు తొక్కను తీసుకుని దాని లోపలి భాగాన్ని ముఖానికి మసాజ్ చేసుకోవాలి. 30 నిమిషాల తరువాత నీటితో కడుక్కోవాలి. అంతేకాకుండా కంటి కిందటి నల్లటి వలయాలు కూడా తొలగిపోతాయి.