రోజంతా ఏసీలో పనిచేస్తున్నారా? అయితే ఈ చిట్కాలు మీ కోసం...
చాలామంది ఉద్యోగినులు రోజంతా ఏసీలోనే పనిచేస్తుంటారు. అలాంటి వారి చర్మం, జుట్టు, పెదాలు తరచుగా పొడిబారుతుంటాయి. ఈ సమస్యల నుండి విముక్తి చెందుటకు కొన్ని బ్యూటీ చిట్కాలు.
చాలామంది ఉద్యోగినులు రోజంతా ఏసీలోనే పనిచేస్తుంటారు. అలాంటి వారి చర్మం, జుట్టు, పెదాలు తరచుగా పొడిబారుతుంటాయి. ఈ సమస్యల నుండి విముక్తి చెందుటకు కొన్ని బ్యూటీ చిట్కాలు.
ఏసీ వలన వచ్చే చల్లని గాలి తేమ ఉండదు. చర్మానికి తేమ అందించే గుణం దీనిలో తక్కువే. కాబట్టి వీలైనంత వరకు నీళ్లను ఎక్కువగా తీసుకుంటే మంచిది. అలానే రెండు గంటలకొకసారి కారిడార్‌లో అటూ ఇటూ తిరుగుతూ ఉండాలి. క్లెన్సర్, ఫేస్‌వాష్‌లు వాడుతున్నట్లైతే వాటిలో నురుగురాని వాటిని తీసుకోవాలి. రెండుగంటల ఒకసారి చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.
చర్మం అధికంగా పొడిబారుతుంటే స్వయంగా తేమ అందించే ఏర్పాట్లను చేసుకుంటే మంచిది. ఏసీలోనే ఎక్కువసేపు ఉన్నట్లైతే వారికి వడదెబ్బ తగిలే అవకాశాలు అధికంగా ఉన్నాయి. చర్మం పొడిబారే లక్షణాలు ఉన్నవారు మాయిశ్చరైజర్ తప్పనిసరిగా వాడవలసిన వస్తుంది. ఏసీలో చల్లదనం ఎక్కువగా ఉంటే తీవ్రమైన తలనొప్పి, అలసటకు గురవుతారు. కాబట్టి ఏసీని కాస్త తగ్గించుకుని పెట్టుకుంటే మంచిది.