బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 23 జులై 2018 (10:24 IST)

పంచతార హోటల్‌లో ఆ ఇద్దరు.. హోటళ్లు, స్పాల్లో విచ్చలవిడిగా సెక్స్ రాకెట్..

హైదరాబాద్ నగరం, బంజారాహిల్స్‌లోని పంచతార హోటల్‌లో భోజ్‌పురి నటి.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. సమాచారం అందడంతో ఉత్తర మండలం పోలీసులు ఆ పంచతార హోటల్‌కు వెళ్లారు. సదరు గది వెళ్లి తల

హైదరాబాద్ నగరం, బంజారాహిల్స్‌లోని పంచతార హోటల్‌లో భోజ్‌పురి నటి.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. సమాచారం అందడంతో ఉత్తర మండలం పోలీసులు ఆ పంచతార హోటల్‌కు వెళ్లారు. సదరు గది వెళ్లి తలుపుతట్టారు. ఓ యువతి.. ఓ పురుషుడు గదిలో ఉన్నారు.


భార్యాభర్తలా? అని ప్రశ్నించగా.. నీళ్లు నమిలారు. అంతే పోలీసులు వివరాలు సేకరిస్తే.. ఆ పురుషుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అమిత్‌ మహేంద్రశర్మ, భోజ్‌పురి సినిమాల్లో నటిస్తున్న కథానాయికగా ఆ యువతిని గుర్తించారు. వీరు తెలిపిన వివరాలతో వ్యభిచారం నిర్వహిస్తున్న జనార్దన్‌రావు అలియాస్‌ జానీని అరెస్ట్‌ చేశారు.  
 
ఇప్పటికే చికాగో ఘటన టాలీవుడ్ ప్రతిష్టకు భంగం కలిగించింది. ఇదే తరహాలో సెక్స్‌ రాకెట్ల నిర్వహణ విచ్చలవిడిగా కొనసాగుతోంది. అనైతిక కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించే దళారీలు.. వ్యక్తులు వ్యవస్థీకృతంగా మారి పోలీసులకు దొరక్కుండా వీటిని కొనసాగిస్తున్నారు. పంచతార హోటళ్లు.. స్పాలు.. సంపన్నుల ప్రాంతాల్లో యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. విటులను ఆకర్షించేందుకు నిర్వాహకులు రష్యా, నేపాల్‌, ఇండోనేషియాల్లో ఉంటున్న యువతులను డబ్బుతో ప్రలోభపెట్టి రప్పిస్తున్నారు. 
 
బాలీవుడ్‌లోని జూనియర్‌ నటీమణులు, కోల్‌కతా, దిల్లీ, ముంబయి నగరాల్లో ఖరీదైన సెక్స్‌వర్కర్లను రప్పిస్తున్నారు. మరి కొందరిని తాత్కాలిక ఉద్యోగుల పేరుతో ఇక్కడికి రప్పించి వారితో వ్యభిచారం చేయిస్తున్నారు.  
 
ఇక పంచతార హోటళ్లలో అనైతిక కార్యకలాపాలు వ్యవస్థీకృతంగా మారాయి. హిందీ, మరాఠీ, భోజ్‌పురి కథానాయికలును ఇక్కడి రప్పించి సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారు.

దిల్లీ నుంచి ఉదయాన్నే విమానాల్లో రావడం, పంచతార హోటళ్లలో బస చేయడం, రాత్రి విమానాల్లో వెళ్లిపోవడం... ఇలా నిత్యం అనైతిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇక అంతర్జాలం అందుబాటులోకి రావడం, విదేశీ తరహాలో స్పాలు.. మసాజ్‌ కేంద్రాలు ఏర్పాటు కావడంతో అనైతిక కార్యకలాపాలు రూపు మార్చుకున్నాయి.