మంగళవారం, 14 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 14 జులై 2018 (09:11 IST)

వ్యభిచారం చేయడానికి ఇష్టమా? వీఐపీలు రెడీ... రేటు రూ.3 లక్షలు.. నటికి ఆఫర్

వ్యభిచార నిర్వాహకులు తమ వ్యాపారాన్ని గుట్టుచప్పుడుకాకుండా నిర్వహించుకునేందుకు వివిధ రకాలైన వ్యూహాలతో ముందుకుసాగుతున్నారు. తాజాగా చెన్నైలో వ్యభిచారదందా వెలుగుచూసింది. రిలేషన్‌షిప్ డేటింగ్ సర్వీస్ పేరుత

వ్యభిచార నిర్వాహకులు తమ వ్యాపారాన్ని గుట్టుచప్పుడుకాకుండా నిర్వహించుకునేందుకు వివిధ రకాలైన వ్యూహాలతో ముందుకుసాగుతున్నారు. తాజాగా చెన్నైలో వ్యభిచారదందా వెలుగుచూసింది. రిలేషన్‌షిప్ డేటింగ్ సర్వీస్ పేరుతో వెలుగులోకి ఈ వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తూ వచ్చారు.
 
ఫేస్‌బుక్, వాట్సాప్‌ల ద్వారా యువకులకు వలవేస్తూ వ్యభిచార సామ్రాజ్యాన్ని నడుపుతున్న ఇద్దరు యువకులను చెన్నై పోలీసులు అరెస్ట్‌ చేశారు. చెన్నై అన్నానగర్‌లో నివసించే తమిళ సినీ, టీవీ సీరియల్‌ నటి జయలక్ష్మి ఇటీవల నగర పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. 'రిలేషన్‌షిప్‌ డేటింగ్‌ సర్వీస్‌' పేరుతో కొన్నిరోజులుగా 2 నంబర్ల నుంచి తన వాట్సప్‌కు అసభ్యకర సందేశాలు వస్తున్నాయని తెలిపింది. 
 
'మీరు డేటింగ్‌ చేయడానికి ఇష్టపడుతున్నారా. మీతో రావడానికి వీఐపీలు సిద్ధం. రూ.30 వేలు మొదలుకుని రూ.3 లక్షల వరకు చెల్లించేందుకు వారు సిద్ధంగా ఉన్నారు' వంటి సందేశాలు వస్తున్నాయని దీనిపై చర్యలు తీసుకోవాలని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
కమిషనర్‌ విశ్వనాథన్ ఆదేశాల మేరకు వ్యభిచార నిరోధక విభాగం పోలీసులు విచారణ చేపట్టి చెన్నై విరుగంబాక్కంలో ఉండే మురుగ పెరుమాళ్, కవియరసన్‌ అనే ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.