శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 21 జూన్ 2018 (16:31 IST)

వామ్మో... బెజవాడలో వ్యభిచారగుట్టు రట్టు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక రాజధానిగా ఉన్న బెజవాడలో వ్యభిచారగుట్టును పోలీసులు రట్టు చేశారు. ఇంటి నుంచి పారిపోయిన వచ్చిన ఓ యువతిని ఆటో డ్రైవర్ నమ్మించి వ్యభిచారగృహం నిర్వాహకురాలికి రూ.20 వేలకు విక్రయిం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక రాజధానిగా ఉన్న బెజవాడలో వ్యభిచారగుట్టును పోలీసులు రట్టు చేశారు. ఇంటి నుంచి పారిపోయిన వచ్చిన ఓ యువతిని ఆటో డ్రైవర్ నమ్మించి వ్యభిచారగృహం నిర్వాహకురాలికి రూ.20 వేలకు విక్రయించాడు. ఫలితంగా ఆ యువతి ఒక యేడాది కాలంగా వ్యభిచారకూపంలో మగ్గుతూ వచ్చింది. చివరకుసాటి వ్యభిచారిణుల సహకారంలో బయటపడిన ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే..
 
ఖమ్మం జిల్లాకు చెందిన యువతి తల్లిదండ్రులు చనిపోవడంతో పెద్దనాన్న ఓ ముసలివాడికి ఇచ్చి పెళ్ళి చేశాడు. ఆ పెళ్లి ఇష్టం లేక ఆమె ఇంటి నుంచి పారిపోయి విజయవాడ వచ్చింది. ఆమె స్థానిక బస్టాండులో తచ్చాడుతుండగా గమనించిన ఓ ఆటో డ్రైవర్‌.. కూలి పని ఇప్పిస్తానని చెప్పి నమ్మించాడు. దీంతో ఆటో ఎక్కిన ఆ యువతిని నేరుగా వ్యభిచారం నిర్వహించే శోభారాణి అనే మహిళకు రూ.20 వేలకు విక్రయించాడు. 
 
ఫలితంగా గత యేడాదికాలంగా నుంచి వ్యభిచార కూపంలో నరకం అనుభవిస్తున్న ఆమెను స్థానిక మహిళలు కాపాడారు. బాధిత యువతితోపాటు కాలనీలోని మరికొంతమందిని వ్యభిచార కూపంలోకి ఆమె దింపినట్టు ఆరోపణలు ఉన్నాయి. శోభారాణిని అరెస్ట్ చేసిన పోలీసులు యువతిని అమ్మిన ఆటోడ్రైవర్‌ కోసం గాలిస్తున్నారు.