సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 17 డిశెంబరు 2017 (07:56 IST)

తాజ్ డెక్కన్ హోటల్‌లో వ్యభిచారం.. ఇద్దరు హీరోయిన్లు అరెస్టు

హైదరాబాద్ నగరం కేవలం డ్రగ్స్‌కు మాత్రమేకాకుండా, వ్యభిచారానికి కూడా నిలయంగా మారుతోంది. తాజాగా ప్రఖ్యాత స్టార్ హోటల్ తాజ్ డెక్కన్‌లో సాగుతున్న వ్యభిచార రాకెట్ గుట్టును హైదరాబాద్ నగర టాస్క్ ఫోర్స్ పోలీసు

హైదరాబాద్ నగరం కేవలం డ్రగ్స్‌కు మాత్రమేకాకుండా, వ్యభిచారానికి కూడా నిలయంగా మారుతోంది. తాజాగా ప్రఖ్యాత స్టార్ హోటల్ తాజ్ డెక్కన్‌లో సాగుతున్న వ్యభిచార రాకెట్ గుట్టును హైదరాబాద్ నగర టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. 
 
బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 1లోని హోటల్‌ తాజ్‌ డెక్కన్‌లో హీరోయిన్లతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. ముఖ్యంగా, ధనవంతుల పిల్లలను ఆకర్షిస్తూ రాత్రికి రూ.లక్ష, ఆ పైన డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. దీంతో నార్త్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మిడ్ నైట్ డెకాయ్ ఆపరేషన్ చేపట్టారు. 
 
ఈ ఆపరేషన్‌లో ఇద్దరు హీరోయిన్లను అరెస్టు చేశారు. వీరిలో ఒకరు బెంగాలీ నటి కాగా, మరొకరు తెలుగు హీరోయిన్. ఈమె గత యేడాది రిలీజైన చిత్రంలో నటించింది. వీరిద్దరితో పాటు మరికొంతమంది విటులను అరెస్టు చేసిన టాస్క్ ఫోర్స్ స్థానిక పోలీసులకు అప్పగించారు. అలాగే, రూ.50 వేల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.