సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2017 (11:32 IST)

భార్యకు విడాకులు ఇచ్చేశా.. నిన్ను పెళ్లిచేసుకుంటానని నమ్మించీ...

కట్టుకున్న భార్యకు విడాకులు ఇచ్చేశా.. ఇక నిన్ను పెళ్లి చేసుకుంటానంటూ ఓ బాలికను కారు డ్రైవర్ నమ్మించి అత్యాచారం చేసిన ఘటన ఒకటి తాజాగా హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే,

కట్టుకున్న భార్యకు విడాకులు ఇచ్చేశా.. ఇక నిన్ను పెళ్లి చేసుకుంటానంటూ ఓ బాలికను కారు డ్రైవర్ నమ్మించి అత్యాచారం చేసిన ఘటన ఒకటి తాజాగా హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
నగరానికి చెందిన 16 యేళ్ళ బాలిక కొద్ది రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి లంగర్‌హౌజ్‌లోని టోలిచౌక్‌ దర్గాకు వెళ్లింది. అక్కడ మునావర్‌ హుస్సేన్‌ ఖాన్‌(23)తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారిద్దరూ ఫోనులో మాట్లాడుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో ఆ బాలికపై కన్నేసిన ఖాన్... బాలికతో తనకు పెళ్లి అయి విడాకులు తీసుకున్నానని, నీవు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.
 
దీంతో తల్లిదండ్రులకు చెప్పకుండా ఈ నెల 7న మునావర్‌తో వెళ్లిపోయింది. ఇద్దరు కలిసి పోలీస్‌ అకాడమీ సన్‌సిటీ సమీపంలో ఓ రూం అద్దెకు తీసుకొని కొద్ది రోజులు ఎంజాయ్ చేశారు. ఇంతలో తన తల్లికి బాగోలేదన్న విషయం తెలుసుకున్న ఆ బాలిక ఇంటికి పంపించాలని ఖాన్‌ను కోరింది.
 
ఆ వెంటనే బాలికను బోరబండలో వదిలేసి ఖాన్ వెళ్లిపోయాడు. ఇంటికి వచ్చిన బాలికను ఎక్కడికి వెళ్లావంటూ తల్లిదండ్రులు నిలదీయడంతో అసలు విషయం వెలుగు చూసింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, లంగర్‌హౌజ్‌లో ఉంటున్న మునావర్‌ హుస్సేన్‌ఖాన్‌ను అరెస్ట్‌ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. కాగా మునావర్‌కు భార్య, బాబు, పాప ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.