సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శుక్రవారం, 15 డిశెంబరు 2017 (20:50 IST)

ప్రపంచ తెలుగు మహాసభలు : గురువుకి కేసీఆర్ పాదాభివందనం

హైదరాబాద్ వేదికగా శుక్రవారం సాయంత్రం ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. వీటిని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ వేడుకల్లో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది.

హైదరాబాద్ వేదికగా శుక్రవారం సాయంత్రం ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. వీటిని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ వేడుకల్లో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ వేడుకలను ప్రారంభించారు. తర్వాత జాతీయ గీతాలాపనతో సభలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విశిష్ట అతిథులుగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు పాల్గొన్నారు. 
 
సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, కడియం శ్రీహరి తదితరులను వేదికపై ఆశీనులయ్యారు. వీరంతా తెలంగాణ తల్లికి పుష్పాంజలి ఘటించారు. కేసీఆర్‌ మొదటగా తనకు విద్యనేర్పిన గురువు బ్రహ్మ శ్రీ మృత్యుంజయ శర్మకు తొలుత నుదుట కుంకుమ బొట్టు పెట్టి, ఆ తర్వాత శాలువా కప్పి ఘనంగా సత్కరించి, అనంతరం ఆయనకు పాదాభివందనం చేసి ఆశీర్వచనం తీసుకున్నారు.
 
<iframe width="654" height="380" src="https://www.youtube.com/embed/HOrYNwgDaa8" frameborder="0" gesture="media" allow="encrypted-media" allowfullscreen></iframe>