శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 15 డిశెంబరు 2017 (10:40 IST)

మైక్రోసాఫ్ట్‌ క్రెడిట్ చంద్రబాబుదే : కేటీఆర్ ప్రశంసలు

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. మైక్రోసాఫ్ట్‌ను తెచ్చిన ఘనత చంద్రబాబుదేనని ఆయన అన్నారు.

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. మైక్రోసాఫ్ట్‌ను తెచ్చిన ఘనత చంద్రబాబుదేనని ఆయన అన్నారు. 
 
హైదరాబాద్ లో టెక్ మహీంద్ర కంపెనీలో జరిగిన ఓ కార్యక్రమంలో అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిస్తూ, హైదరాబాద్‌ నగరానికి మైక్రోసాఫ్ట్‌ను తీసుకొచ్చింది చంద్రబాబునాయుడేనని, ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. 
 
హైదరాబాద్ ఒకప్పుడు ఇప్పటిలా ఉండేది కాదనీ… 17 ఏళ్ల కిందటే బిల్ గేట్స్‌ను ఒప్పించి.. మైక్రోసాఫ్ట్‌ను చంద్రబాబు రప్పించగలిగారని పొగిడారు. మైక్రోసాఫ్ట్ సంస్థ వచ్చిన తర్వాతనే.. గూగుల్, ఒరాకిల్ వంటి అనేక ఐటీ దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ నగరానికి వచ్చాయని ఆయన గుర్తు చేశారు.