శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : బుధవారం, 13 డిశెంబరు 2017 (14:36 IST)

బర్త్‌డే పేరుతో రేవ్ పార్టీ.. అమ్మాయిల నగ్న నృత్యాలు

హైదరాబాద్ నగరంలో పుట్టిన రోజు వేడుకల పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారు. ఇందులో అమ్మాయిలతో పూర్తిగా నగ్న డ్యాన్సులు చేయించారు.

హైదరాబాద్ నగరంలో పుట్టిన రోజు వేడుకల పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారు. ఇందులో అమ్మాయిలతో పూర్తిగా నగ్న డ్యాన్సులు చేయించారు. ఈ విషయాన్ని పసిగట్టిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం చేరవేయడంతో గుట్టురట్టయింది. 
 
హైదరాబాద్‌ నగరంలోని పహడీషరీఫ్‌ పీఎస్ పరిధిలోని ఆర్‌జీ కాలనీ సమీపంలో ఓ ఫాంహౌస్‌లో వేకువజామున రేవ్ పార్టీ జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో కొంతమంది పోలీసుల బృందం ఆ ఫామ్‌హౌస్‌పై ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. 
 
ఈ తనిఖీల్లో పోలీసులు 15 మంది యువకులు, ముగ్గురు యువతులు అరెస్ట్ చేశారు. యువకుల్లో బడాబాబుల కుమారులు ఉన్నట్టు సమాచారం. నిందితులు పాతబస్తీకి చెందినవారని పోలీసులు వెల్లడించారు.