మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: గురువారం, 19 జులై 2018 (17:02 IST)

విజయవాడలోని ప్రైవేటు హోటల్లో యువతులు బట్టలిప్పి...

పాశ్చాత్య సంస్కృతికి యువతీయువకులు బాగా అలవాటుపడిపోయారు. సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు కొంతమంది. అలాంటి సంఘటనే విజయవాడలో జరిగింది. వైద్యవృత్తి చదువుతున్న కొంతమంది యువతీయువకులు విజయవాడ భవానీపురంలోని ఓ హోటల్లో గెట్ టు గెదర్ కార్యక్రమం ఏర్పా

పాశ్చాత్య సంస్కృతికి యువతీయువకులు బాగా అలవాటుపడిపోయారు. సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు కొంతమంది. అలాంటి సంఘటనే విజయవాడలో జరిగింది. వైద్యవృత్తి చదువుతున్న కొంతమంది యువతీయువకులు విజయవాడ భవానీపురంలోని ఓ హోటల్లో గెట్ టు గెదర్ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. 
 
నిన్న రాత్రి 9 గంటల నుంచి అర్థరాత్రి వరకు గట్టిగా కేకలు వేస్తూ ఎంజాయ్ చేశారు. హోటల్ నుంచి విపరీతమైన సౌండ్‌లు రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హోటలుకు వచ్చి లోపల జరుగుతున్న తంతును చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. కొంతమంది యువతులు మద్యం మత్తులో అర్థనగ్నంగా నిలబడి డ్యాన్సులు చేస్తూ కనిపించారు. 
 
యువకులు కూడా మద్యం బాటిళ్ళు చేతపట్టుకుని డ్యాన్స్ చేస్తున్నారు. దీంతో ఐదుగురు యువతులను, 50 మంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో వైద్య వృత్తిని అభ్యసిస్తున్నవారే అధికంగా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. మరికొంతమంది విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుతున్నట్లు చెప్పారు. అలాగే మరికొంతమంది స్థానికంగా ఉన్న ఛానళ్ళలో యాంకరింగ్ చేస్తున్నవారు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.