సంబంధిత వార్తలు
- బిగ్ బాస్-2.. భానుశ్రీకి ఎంత పెద్దమనుసు.. తేజస్వి ఎలిమినేషన్ లీక్..
- ఆర్ఎక్స్-100లో కిస్ సీన్లను రిపీట్ చేశాం.. కానీ వన్ మోర్ చేయలేదు: పాయల్
- బీజేపీలో 'ఈరోజుల్లో' హీరోయిన్ రేష్మ... పాలమూరు నుంచి పోటీ
- మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా.. మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి: గల్లా
- పెళ్ళి కన్నా సహజీవనమే బెస్ట్... డేటింగ్ చేసి బోర్ కొట్టేసింది: మాధవీలత
కార్తీకి కౌంటరిచ్చిన శ్రీరెడ్డి... లాంగ్ డ్రైవ్‌లో కారునే పడకగదిగా మార్చేస్తున్నారు..
శ్రీరెడ్డి తమిళ్ లీక్స్ మొదలు పెట్టడంతో కోలీవుడ్ ప్రముఖుల్లో వణుకు మొదలైంది. శ్రీరెడ్డి ఇప్పటికే రాఘవ లారెన్స్, మురుగదాస్, సందీప్ కిషన్, త్రిష, నయనతార వంటి ప్రముఖుల పేర్లు ప్రస్తావిస్తున్న సంగతి తెలిస
శ్రీరెడ్డి తమిళ్ లీక్స్ మొదలు పెట్టడంతో కోలీవుడ్ ప్రముఖుల్లో వణుకు మొదలైంది. శ్రీరెడ్డి ఇప్పటికే రాఘవ లారెన్స్, మురుగదాస్, సందీప్ కిషన్, త్రిష, నయనతార వంటి ప్రముఖుల పేర్లు ప్రస్తావిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లీక్స్ అంటూ చెన్నైలో మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తోంది.
తాజాగా... శ్రీరెడ్డి చిక్కులు నడిగర్ సంఘం వరకు చేరాయి. నడిగర్ సంఘం కోశాధికారిగా పనిచేస్తున్న హీరో కార్తీ.. ఆధారాలు లేకుండా శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలేంటని ప్రశ్నించారు. ఆమెపై ఫిర్యాదు చేస్తే.. అప్పుడు విచారణ జరుపుతామన్నారు.
దీనిపై శ్రీరెడ్డి స్పందిస్తూ.. తనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. లేకపోతే తానేంటో చూపించాల్సి వస్తుంది. లాజిక్కులు మాట్లాడొద్దు కార్తీ సార్ అంటూ కౌంటర్ఇచ్చింది. నడిగర్ సంఘం ఉన్నది సమస్యలు తీర్చడానికి.. ఉచిత సలహాలు ఇవ్వడానికి కాదు అంటూ శ్రీరెడ్డి కార్తీ పై ఫైర్ అయింది.
మరోవైపు దర్శకనిర్మాతలు అవకాశాల పేరిట హీరోయిన్లను తెగ వాడేసుకుంటున్నారని శ్రీరెడ్డి ఆరోపించింది. నటులు, నిర్మాతలు హీరోయిన్లను లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తున్నారని.. అలా కారులోనే పనికానిచ్చేస్తున్నారని.. కారునే పడకగదిగా మార్చేస్తున్నారని, హీరోయిన్లతో ఉల్లాసంగా వుంటున్నారని విమర్శలు గుప్పించింది.
కొన్ని సందర్భాల్లో ఓ పాట కోసమంటూ విదేశాల్లో షూటింగ్‌కు తీసుకెళ్ళి.. హీరోయిన్లపై తమ వాంఛను తీర్చుకుంటున్నారని శ్రీరెడ్డి చెప్పింది. దర్శకనిర్మాతలే కాకుండా మేనేజర్, కెమెరామేన్, మేకప్ మ్యాన్‌లను కూడా హీరోయిన్లు కాంప్రమైజ్ చేయాలని తెలిపింది. తమిళ సినీ రంగానికి చెందిన పలువురు నటీమణులతో ఉల్లాసంగా గడిపేందుకు హైదరాబాదునే ఎంచుకుంటున్నారని శ్రీరెడ్డి బాంబు పేల్చింది.
