మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: గురువారం, 19 జులై 2018 (18:48 IST)

పెళ్ళి కన్నా సహజీవనమే బెస్ట్... డేటింగ్ చేసి బోర్ కొట్టేసింది: మాధవీలత

పెళ్ళి చేసుకుని ఒకరినొకరు మోసం చేసుకోవద్దు.. అసహ్యించుకోవద్దు.. మీకు ఒకడు నచ్చాడు. అతనితో సంవత్సరం ఉండండి.. అంతకుమించి ఉండకండి.. బోర్ కొట్టేస్తుంది. సంవత్సరం కలిసి ఉన్నప్పుడు దాక్కుని వేరే అమ్మాయితో చాటింగ్ చేయడం మానుకోండి. సహజీవనం చేస్తే తప్పేమీ లేద

పెళ్ళి చేసుకుని ఒకరినొకరు మోసం చేసుకోవద్దు.. అసహ్యించుకోవద్దు.. మీకు ఒకడు నచ్చాడు. అతనితో సంవత్సరం ఉండండి.. అంతకుమించి ఉండకండి.. బోర్ కొట్టేస్తుంది. సంవత్సరం కలిసి ఉన్నప్పుడు దాక్కుని వేరే అమ్మాయితో చాటింగ్ చేయడం మానుకోండి. సహజీవనం చేస్తే తప్పేమీ లేదు. ఒక అమ్మాయికి అబ్బాయి నచ్చినా, ఒక అబ్బాయికి అమ్మాయి నచ్చినా ఇద్దరూ కలిసి సంవత్సరం గడపండి.. ఇది మీకే మంచిది. 
 
పెళ్ళి ఎందుకు. ఇద్దరు కలిసి జీవితాంతం మోసం చేసుకుంటూ బతకడం తప్పు. పెళ్ళి అంటే మానసిక ద్రోహం చేసుకుంటూ బతకడం తప్పు కదా. సమాజం కోసమో, అమ్మా..నాన్న కోసమో పెళ్ళి చేసుకోవాలనుకోకండి. హ్యూమన్ రిలేషన్‌షిప్‌కు అలవాటు పడకండి. మన జీవితాన్ని మనమే నిర్దేశించుకోవాలి. నేను మొన్నటివరకు డేటింగ్‌లో ఉన్నా. ఇప్పుడు బాగా బోర్ కొట్టేసింది. డేటింగ్ మానేశాను. మళ్ళీ ఎవరైనా బాగా నచ్చితే డేటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటోంది సినీనటి మాధవీలత.