శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Kowsalya
Last Updated : గురువారం, 19 జులై 2018 (12:56 IST)

కలలో గాజులు కనిపిస్తే... ఏం జరుగుతుందో తెలుసా?

స్త్రీ జీవితంలో గాజులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. వీటిని కేవలం అలంకార ప్రాయంగా ఎవరు భావించరు. స్త్రీలు గాజులు ధరించడమనేది ఆచార వ్యవహారాలలో ఒక ప్రధానమైన అంశంగా కనిపిస్తుంది. ఆడపిల్లలు చేతికి గాజులు లేకుండా

స్త్రీ జీవితంలో గాజులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. వీటిని కేవలం అలంకారప్రాయంగా ఎవరు భావించరు. స్త్రీలు గాజులు ధరించడమనేది ఆచార వ్యవహారాలలో ఒక ప్రధానమైన అంశంగా కనిపిస్తుంది. ఆడపిల్లలు చేతికి గాజులు లేకుండా కనిపిస్తే పెద్దలు మందలిస్తుంటారు. ఏ వేడుకకైనా వెళ్లవలసి వచ్చినా, పండుగలు వచ్చినా స్త్రీలు ముందుగా కొత్తగాజులు కొనడానికే ఆసక్తిని చూపుతుంటారు.
 
పుణ్యక్షేత్రానికి వెళితే ముందుగా స్త్రీలు కొనుగోలు చేసేది గాజులే. ఇక తమ బంధుమిత్రులను మరిచిపోకుండా గాజులు తీసుకుంటుంటారు. గాజులు వేసుకునేటప్పుడు వాటిని ఇతరులకు చూపేటప్పుడు వాళ్లు పొందే ఆనందం అంతా ఇంతా కాదు. స్త్రీ జీవితంలో ఇంతటి ఆనందానుభూతులను ఆవిష్కరించే గాజులు ఒక్కోసారి వాళ్ల కలలోకి కూడా వస్తుంటాయి.
 
కలలో గాజులు ధరిస్తున్నట్లుగా కనిపిస్తే మరునాడు ఉదయాన్నే ఆ విషయాన్ని గురించి ఇంట్లో ప్రస్తావిస్తుంటారు. అయితే ఆ విధంగా కల రావడం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందోననే సందేహం వాళ్లకి కలగకపోదు. ఈ విధంగా కల రావడం శుభ సూచకమని శాస్త్రం చెబుతోంది. పెళ్లీడు వచ్చిన అమ్మాయిలకు గాజులు ధరిస్తున్నట్లుగా కలవస్తే త్వరలోనే వారి వివాహం జరుగుతుందని శాస్త్రంలో చెప్పబడుతోంది.