గురువారం, 28 సెప్టెంబరు 2023
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 17 జులై 2018 (11:44 IST)

కలలో వాన కనిపిస్తే... ఏం జరుగుతుందో తెలుసా?

వాన అనే మాట మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. వానపడుతూ ఉండే దృశ్యం ఆనందానుభూతులను అందిస్తుంది. వాన అంటే ఇష్టంలేని వాళ్లంటూ ఎవరూ ఉండరు. వానలో తడవడానికి చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఆసక్తి చూపుతుంటారు.

వాన అనే మాట మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. వాన పడుతూ ఉండే దృశ్యం ఆనందానుభూతులను అందిస్తుంది. వాన అంటే ఇష్టంలేని వాళ్లంటూ ఎవరూ ఉండరు. వానలో తడవడానికి చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఆసక్తి చూపుతుంటారు. మేఘాల కింద ఎవరో జల్లెడ పట్టినట్టుగా చినుకులు రాలితే చాలు అప్పటి వరకూ పడిని కష్టాలన్నీ మరచిపోయి ఆ వానను ఆస్వాదించే వాళ్లు కనిపిస్తుంటారు.
 
తడిస్తే మెులకెత్తం గదా అనుకుంటూ కావాలని వానలో నడుస్తూ వెళ్లే వాళ్లూ కూడా ఉంటారు. వానలో తడిస్తే అనారోగ్యం బారిన పడవలసి వస్తుందని చెప్పేవాళ్ల మనసు కూడా వానవైపు లాగుతుంది. వానను కిటికీలో నుండి చూడడానికి, తడవడానికి, తడుస్తు నడవడానికి అంత ఉత్సాహాన్ని చూపుతుంటారు. అలాంటి వాన ఒక్కోసారి కలలో కూడా కనిపిస్తూ ఉంటుంది. వానను కలలో చూసినా బయటచూసిన అనుభూతే కలుగుతుంటుంది.
 
అయితే దాని ఫలితం ఎలా ఉంటుందనే విషయమై కొంతమందికి సందేహం కలుగుతుంటుంది. కలలో వాన కనిపించడం శుభసూచకమని శాస్త్రం చెబుతోంది. కలలో వాన కనిపించడం వలన అప్పటి వరకు ఇబ్బంది పెడుతూ వచ్చిన సమస్యలన్నీ తొలగిపోతాయట. సమస్యలు తొలగిపోయి సంతోషకరమైన జీవితం ఆరంభమవుతుందనే విషయాన్ని ఈ కల ముందుగా తెలియజేస్తుందని చెప్పబడుతోంది.