1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
  4. Tan skin beauty care tips with sugar

కమిలిన చర్మానికి... చక్కెర నీటిని రాసుకుంటే...

తియ్యదనాన్ని ఇచ్చే చక్కెరతో సౌందర్యానికి గల చిట్కాలు. మృతుకణాలను తొలగించుటలో చక్కెర ఎంతగానో దోహదపడుతుంది. చిటికెడు చక్కెరలో రెండు చుక్కల నీళ్లు వేసుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని పెదాలప

tan
తియ్యదనాన్ని ఇచ్చే చక్కెరతో సౌందర్యానికి గల చిట్కాలు. మృతుకణాలను తొలగించుటలో చక్కెర ఎంతగానో దోహదపడుతుంది. చిటికెడు చక్కెరలో రెండు చుక్కల నీళ్లు వేసుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని పెదాలపై మృదువుగా రుద్దుకోవాలి. ఇలా చేయడం వలన మృతుకణాలు తొలగిపోతాయి. పెదాలు అందంగా మారతాయి.
 
అరకప్పు బ్రౌన్ షుగర్‌లో కొన్ని అరటిపండు ముక్కలు వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి రాసుకుని మర్దన చేసుకుని కాసేపటి తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వలన చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. కమిలిపోయిన చర్మానికి చక్కెరలో కొద్దిగా నూనెను కలుపుకుని రాసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. కమిలి చర్మం కాస్త మృదువుగా మారుతుంది. 
 
చక్కెరలో పిప్పరమెంట్ నూనెను కలుపుకుని ఆ మిశ్రమాన్ని పాదాలకు రాసుకోవాలి. అరగంట తరువాత మర్దన చేసుకుని కడిగేసుకోవాలి. ఇలా తరుచుగా చేయడం వలన పాదాలు పగుళ్లు తొలగిపోయి మృదువుగా కనిపిస్తాయి. పావుకప్పు బ్రౌన్ షుగర్‌లో 2 స్పూన్స్ ఆలివ్ నూనెను వేసి కలుపుకుని ఆ మిశ్రమాన్ని చేతులకు పట్టించాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వలన చేతులు మృదువుగా మారుతాయి.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
చింతచిగురుతో చికెన్ కూరనా? ఎలా చేయాలో చూద్దాం?