శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 26 జులై 2018 (19:27 IST)

ఇండియా ఒక్క అడుగు ముందుకేస్తే... పాక్ 2 అడుగులు వేస్తుంది... ఇమ్రాన్ ఖాన్

పాకిస్తాన్ దేశానికి కాబోయే ప్రధానమంత్రి ఒకప్పటి స్టార్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ అని దాదాపు ఖాయమైపోయింది. ఈ నేపధ్యంలో ఇమ్రాన్ ఖాన్ ఇండియా గురించి పలు విషయాలు మాట్లాడారు. అవేంటో ఒక్కసారి చూద్దాం. భారతదేశంలో ఎక్కడ ఎలాంటి దాడులు జరిగినా అది పాకిస్తాన్ కార

పాకిస్తాన్ దేశానికి కాబోయే ప్రధానమంత్రి ఒకప్పటి స్టార్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ అని దాదాపు ఖాయమైపోయింది. ఈ నేపధ్యంలో ఇమ్రాన్ ఖాన్ ఇండియా గురించి పలు విషయాలు మాట్లాడారు. అవేంటో ఒక్కసారి చూద్దాం.
 
భారతదేశంలో ఎక్కడ ఎలాంటి దాడులు జరిగినా అది పాకిస్తాన్ కారణంగానే జరిగిందంటూ ఆరోపణలు అక్కడ సహజమైపోయాయి. ఈ పరిస్థితి మారాలి. ఇలాంటి సమస్యలను అధిగమించి స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరిపేందుకు భారతదేశం ఒక అడుగు ముందుకు వస్తే పాకిస్తాన్ రెండడుగులు ముందుకు వస్తుందని అన్నారు.
 
అలాగే కాశ్మీర్ సమస్య 30 ఏళ్లుగా నలుగుతూ వస్తోందన్న ఇమ్రాన్ ఖాన్... అందరూ చెప్పే మాటే చెప్పారు. భారత దేశ సైన్యం చేతుల్లో కాశ్మీర్ ప్రజల హక్కులు కాలరాయబడుతున్నాయంటూ వ్యాఖ్యానించారు. 
 
గత కొన్ని రోజులుగా ఇండియన్ మీడియా తనను విలన్‌గా చేసి చూపించాయనీ, భారతదేశం పట్ల తను వ్యతిరేకభావంతో వున్నట్లు చిత్రించారని అన్నారు. బాలీవుడ్ చిత్రాలకు తను వ్యతిరేకమంటూ కథనాలు రాశారనీ, ఐతే అదంతా అవాస్తవమన్నారు. ఓ పాకిస్తానీ క్రికెటర్‌గా భారతదేశంలో తను పర్యటించిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు.