సంబంధిత వార్తలు
- ఇండియా ఒక్క అడుగు ముందుకేస్తే... పాక్ 2 అడుగులు వేస్తుంది... ఇమ్రాన్ ఖాన్
- పాకిస్థాన్ ఎన్నికల ఫలితాలు.. ఇమ్రాన్ ఖాన్ ప్రధాని కావడం ఖాయమేనా?
- పాకిస్థాన్ ఎన్నికలు.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు హఫీజ్‌కు గట్టిషాక్
- ఆయన ఉంపుడుగత్తెల్లో భారతీయ మహిళలే ఎక్కువ : ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య
- స్వలింగ సంపర్కులపై స్వామి ఏమన్నారు..? బీజేపీ అది అచ్చి రాదట..!
పరస్పర నిందలు వద్దు.. చర్చించుకుందాం రండి... భారత్‌కు ఇమ్రాన్ పిలుపు
పరస్పర నిందలతో ఒరిగేదేమీ లేదనీ, అందువల్ల కాశ్మీర్ వంటి అత్యంత కీలకమైన అంశాలపై చర్చించుకుందాం రండి అంటూ భారత పాలకులకు పాకిస్థాన్‌కు కాబోయే ప్రధానమంత్రి, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు.
పరస్పర నిందలతో ఒరిగేదేమీ లేదనీ, అందువల్ల కాశ్మీర్ వంటి అత్యంత కీలకమైన అంశాలపై చర్చించుకుందాం రండి అంటూ భారత పాలకులకు పాకిస్థాన్‌కు కాబోయే ప్రధానమంత్రి, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు.
తాజాగా జరిగిన పాకిస్థాన్ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ 120 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఇమ్రాన్ ఖాన్ సై అంటున్నారు. అదేసమయంలో ఇమ్రాన్‌ఖాన్ ఇస్లామాబాద్‌లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
శాంతిదిశగా భారత్ ఒక అడుగు ముందుకు వేస్తే, మేం రెండడుగులు ముందుకు రావడానికి సిద్ధమేనని ప్రకటించారు. "నాకు వ్యక్తిగతంగా భారత్‌లో చాలామంది తెలుసు. క్రికెట్ కారణంగానే ఆ పరిచయాలు నాకు దక్కాయి. ఇరుదేశాల మధ్య కాశ్మీర్ ప్రధాన సమస్య. చర్చల ద్వారా మాత్రమే ఇరుపక్షాలు దానికి పరిష్కారం కనుగొనగలవు" అని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు.
'కాశ్మీర్‌పై పాకిస్థాన్, బలూచిస్తాన్‌పై భారత్ పరస్పరం నిందలకు దిగడం వల్ల ఇరుదేశాలకూ ఒరిగేదేమీ లేదు. వాటిపై ఎంత వాదించుకున్నా మళ్లీ మొదటికే వస్తాం. ఇరుదేశాల ఎదుగుదల ఈ పరస్పర నిందలు ఎంతమాత్రం పనిచేయవు' అని గుర్తు చేశారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత మెరుగుపడాలని ఆయన ఆకాంక్షించారు. గత కొద్దివారాలుగా భారత మీడియా తనను బాలీవుడ్ విలన్‌లా చూపించిందని ఇమ్రాన్ గుర్తుచేశారు.
