1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Will Kiran Abbavaram’s film under Sukumar Writings set a record?

Kiran Abbavaram Record : సుకుమార్‌ రైటింగ్స్‌లో కిరణ్‌ అబ్బవరం చిత్రం రికార్డ్‌ అవుతుందా !

Kiran Abbavaram's Record opening
Kiran Abbavaram's Record opening
క (KA) సినిమాతో హీరో కిరణ్‌ అబ్బవరం  బాక్సాఫీస్‌ వద్ద తన సత్తా చాటి ఇప్పుడు తన 14వ చిత్రాన్ని (#KA14) చిత్రాన్ని స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌కు చెందిన 'సుకుమార్‌ రైటింగ్స్‌' బ్యానర్‌లో ప్రారంభించి అందరినీ ఆశ్చర్యపరిచారు. నేడు అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమాకు రికార్డ్‌  అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ పోస్టర్‌ విడుదల చేశారు. ''కొన్ని కథలు చెబుతారు.. మరికొన్ని రికార్డ్‌ అవుతాయి'' అంటూ మేకర్స్‌ ఇచ్చిన క్యాప్షన్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
 
రికార్డ్‌ పోస్టర్‌లో ఎర్రటి చంద్రుడి నేపథ్యంలో కిరణ్‌ అబ్బవరం ఇంటెన్స్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన వెనుక భాగంలో గంటలు కట్టిన ఓ జంతువు తల కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీంతో ఈ కథ గ్రామీణ ప్రాంతాల్లోని మూఢనమ్మకాలు, బలులు లేదా ఏవైనా రహస్య ఆచారాల చుట్టూ తిరుగుతుందా? అనే ఆసక్లి చూసినవారికి కలిగింది. ఇక, పోస్టర్‌ మొత్తాన్ని వీడియో కెమెరా రికార్డింగ్‌ స్క్రీన్‌ తరహాలో రూపొందించారు. ''A Mysterious World Unfolds!'' (ఒక రహస్య ప్రపంచం ఆవిష్కృతమవుతోంది) అనే ట్యాగ్‌లైన్‌ కూడా ఉత్కంఠను పెంచుతోంది.
 
కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, క సినిమా తర్వాత నిర్మాత వంశీతో కలిసి చేస్తున్న చిత్రమిది. దర్శకుడు వీర జర్నలిస్టుగా చేశారు. కథకుడిగా దర్శకుడిగా మంచి సినిమా తీయనున్నారని కథ విన్నప్పుడే అర్థమైంది. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తాం అని తెలిపారు.
 
 'పుష్ప' సినిమాకు పనిచేసిన వీర కోగటం ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి, అశోక్‌ బండ్రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సుకుమార్‌ రైటింగ్స్‌ ఈ సినిమాను సమర్పిస్తోంది.
 
మరోవైపు కిరణ్‌ అబ్బవరం స్వయంగా దర్శకత్వం వహిస్తున్న 'రియాలిటీ' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సమయంలోనే సుకుమార్‌ రైటింగ్స్‌ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలో 'రికార్డ్‌' లాంటి విభిన్నమైన థ్రిల్లర్‌ను ప్రకటించడం ఇండస్ట్రీలో ఆసక్తికలిగించింది.
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లిపోతున్న అనుష్క శెట్టి.. కారణం ఏంటి?