గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : శనివారం, 28 జులై 2018 (14:36 IST)

పాలలో నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

ముఖంపై మెుటిమలు కనిపిస్తే అమ్మాయిలు తెగ కంగారు పడిపోతుంటారు. అలానే వాటిని తొలగించుకోవడానికి రకరకలా ప్రయోజనాలు చేస్తుంటారు. అయితే కూడా మెుటిమలు పోవు. ఒకవేళ ఇంట్లోని చిట్కాలు పాటిస్తే ఏం జరుగుతుందో చూద్

ముఖంపై మెుటిమలు కనిపిస్తే అమ్మాయిలు తెగ కంగారు పడిపోతుంటారు. అలానే వాటిని తొలగించుకోవడానికి రకరకలా ప్రయోజనాలు చేస్తుంటారు. అయితే కూడా మెుటిమలు పోవు. ఒకవేళ ఇంట్లోని చిట్కాలు పాటిస్తే ఏం జరుగుతుందో చూద్దాం.
 
దాల్చిన చెక్కను పొడిగా చేసుకుని అందులో కొద్దిగా తేనెను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 10 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన మెుటిమలు త్వరా తగ్గిపోతాయి. జాజికాయలో కొద్దిగా పాలు కలుపుకుని ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. కాసేపటికి తరువాత చల్లని నీటితో కడిగేయాలి. 
 
ఎండబెట్టిన కమలా తొక్కలను పొడిగా చేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, వేరుసెనగ నూనెను చేర్చాలి. ఈ పేస్ట్‌ను మెుటిమలు రాసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. మరిగించిన పాలలో కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో దూదిని ముంచి ముఖానికి మర్దన చేసుకోవాలి. పావుగంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన మెుటిమలు తొలగిపోతాయి.