ఇంట్లో దుర్వాసనలకు వెనిగర్‌ను చల్లితే.....
ఈ కాలంలో ఇంట్లో దోమలు, ఈగలు వ్యాపించడమే కాకుండా దుర్వాసన సమస్యలు కూడా అధికంగా ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇంటిని పరిమళభరితం చేసుకోవడం మంచిది. దీనిని కొన్ని చిట్కాలు పాటిస్తే సరి. రంధ్రాలున్న ఒక చిన్న గిన్
ఈ కాలంలో ఇంట్లో దోమలు, ఈగలు వ్యాపించడమే కాకుండా దుర్వాసన సమస్యలు కూడా అధికంగా ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇంటిని పరిమళభరితం చేసుకుంటే మంచిది. అందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరి. రంధ్రాలున్న ఒక చిన్న గిన్నెను తీసుకుని కొన్ని కాఫీ గింజలు వేసి మూత పెట్టుకోవాలి. ఈ గిన్నెను వంటింట్లో ఏ మూలనైన ఉంచుకోవాలి.
ఇలా చేయడం వలన ఇంట్లో దుర్వాసనలు తొలగిపోతాయి. మసాలాలు మాడినప్పుడు ఇల్లంతా వాసన వస్తుంటుంది. అప్పుడు వెనిగర్‌ను తీసుకుని వంటిల్లు, ఇతర గదుల్లో చల్లితే అలాంటి వాసనలు తొలగిపోతాయి. సాంబ్రాణిని పొగను వేసుకోవడం వలన ఇంట్లో దుర్వాసనలు, క్రిమికాటకాలన్నీ నాశనమవుతాయి. మంచి సువాసన వస్తుంది.
నాలుగు కర్పూరం బిళ్లలలో అగరొత్తుల పొడిని కలుపుకుని ఇంట్లో లేదంటే స్నానాల గదుల్లో ఉంచుకోవాలి. ఆ వాసన ఎక్కువ సేపు ఉంటుంది. పైగా కర్పూర పరిమళానికి ఈగలు, దోమలు దరిచేరవు. ఆరోమా నూనెలు అంటే నిమ్మ, లావెండర్, దాల్చిన చెక్క నూనెలు. ఇవి ఇంట్లో పరిమళాలను వెదజల్లడంతో పాటు ఒత్తిడిని కూడా దూరం చేస్తాయి. వీటిల్లో దూదిని ముంచి ఓ గదిలో పక్కన పెడితే చాలు దోమలు తొలగిపోతాయి.